మధురమైన నిరీక్షణ..;-విష్ణు ప్రియ-కలంస్నేహం
పందిరినుండి జాలువారిన తీవెల మాదిరి...
పచ్చని తోరణాలు కట్టినట్టు...
అతిథుల రాకకుస్వాగతం పలుకుతున్న...
హరిత పత్రాల సోయగాలను మించిన...

సుందర వదనారవిందములతో..
పట్టు పరికిణీలు గట్టి...
సంప్రదాయ అలంకరణతో..
అతివలిద్దరు....
అందమైన ముద్దుగుమ్మలై...
మధురమైన ఊసులేవో మదిలో నాట్యమాడుతుండగా..

గుమ్మం ముంగిట...
చెక్కిట చేయి జేర్చి...
ఎవరి ఊహల సంద్రంలో వారు..
అలలై సాగుతూ...
ఎవరి లోకంలో వారు అంతర్లీనమై...

ఏ మన్మధుని రాకకై ఏదిరిచూపులో??
కలల పల్లకిలో ఊరేగుతూ..
భవిష్యత్తుకై ఎన్నెన్ని ఆశల సౌధాలను నిర్మించిరో??

రేపటి ఉషోదయవేళలో...
తమ రాకుమారుల ఆగమనానికై...
ఆత్రంగా వీక్షిస్తూ...
అలవోకగా కదిలే ఆ నీలికళ్ళల్లో
ఎన్నెన్ని వెలుగుల కార్తీక దీపాలో??

పెరుగెడుతున్న మనసుకు కళ్లెం వేయలేక...
ఎంతకీ గడవని కాలాన్ని తొందర పెట్టలేక...
ఏమి చేయాలో తోచని స్థితిలో..
ఆ తరుణీమణుల నిరీక్షణ ఎంత మధురమో!!!!
తెలుసా మీకైనా...???


కామెంట్‌లు