బాలలు(ఇష్టపది మాలిక)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య, కరీంనగర్
బాలల దినోత్సవ శుభాకాంక్షలతో....

బాలలు

బాలలంటే యెవరు? పరమాత్మ రూపములు
బాల్యమంటే భవ్య బంగారు జీవితము

తెల్ల కాగితమె మది, మల్లె పూవే హృది
చిరునవ్వులే సిరులు, పరివారమున దొరలు

మట్టి బుర్రలు కారు,గట్టి పట్టులు వారు
ఎన్నెన్నొ యూహలతొ ఏలెదరు లోకాలు

పిట్టలై రెక్కలతొ విహరించెదరు నింగి
తేటులై పుష్పాల తేనెలను జుర్రెదరు

హయములై బయలులో రయముగను నురికెదరు
కోతులై చెట్లపై కొమ్మచ్చులాడెదరు

దాయలార్గురు లేని ధన్యజీవులు వీరు
కాయకష్టము లేని కడు భాగ్యవంతులూ

నిత్యపరిశీలకులు సత్య శోధన పరులు
భావిలోకాలనల పాలించు నరపతులు

మైనంపు బొమ్మలై మనముందు నిలిచారు
సుగుణాల రాశులను చొప్పించి మలచాలి


కవనశ్రీ చక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125


కామెంట్‌లు