మనకు జీవితం మొదటి భాగంలో తారస పడే వ్యక్తులు మరి కొన్ని సంఘటనలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. మనకు తెలియకుండానే మనం ఎన్నో విషయాలు వారి నుంచి నేర్చుకుంటాం. వాటి వల్ల ప్రభావితం అవుతాము.
అలాంటి విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న నా స్నేహితుని తండ్రి గారి గురించి ఇక్కడ పరిచయం చేస్తాను..
మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా స్నేహితుడైన కామేష్ ఇంటికి తరచుగా వెళ్ళడం జరిగేది. వారి నాన్నగారు రెండు జిల్లాల కి అధికారి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ బెంగుళూరు లో పట్టా పుచ్చుకున్నారు. సర్ సి.వి. రామన్ గారి శిష్యులు . ఆరడుగుల ఎత్తు ఆజానుబాహుడు. అచంచలమైన విశ్వాసం కలిగిన విజ్ఞానఖని అని చెప్పాలి. క్రమ శిక్షణ లో మాత్రం చండశాసనుడే .
l
సెలవు దినాల లో అప్పుడప్పుడు కామేష్ ను కలవడానికి, వాళ్ళ ఇంటికి వెళ్లడం మాకు ఒక పెద్ద సమస్య. కారణం అక్కడ వాడి నాన్న గారు. ఆయన ఆ సమయం లో ఉంటే మాత్రం దిన గండం నూరేళ్ళు ఆయుష్షు లాగా ఉండేది. వాళ్ళ నాన్నగారి కంట పడితే ఇంక అంతే సంగతులు.
మాకు బొత్తిగా తెలియని ప్రపంచ జ్ఞానం మీద ఎన్నో ప్రశ్నలు వేసి ముప్పుతిప్పలు పెట్టే వారు. మేము వెళ్ళినప్పుడు వారి నాన్నగారు ఇంట్లో ఉండకూడదని దేవుడి ని ప్రార్ధించు కుంటూ వెళ్ళేవాళ్ళం..
ఒక రోజు ఇలాగే వెళ్లి మేము ముగ్గురు స్నేహితులం వారి ఇంటికి కాస్త దూరంలో నిలబడి నాన్నగారు ఉన్నారో లేదో అని అంచనా వేస్తూ , ఇంటిని గమనిస్తూ నిలబడ్డాం.
ఇంతలో వాళ్ళ నాన్నగారు బయటకి వచ్చి మా వైపు చూస్తూ" ఒరే దొంగ వెధవల్లారా రండి ఇటు " అని రమ్మని చేయి ఊపి నిలబడ్డారు. బాబోయ్ దొరికిపోయాం అనుకుంటూ మేము చాలా సీరియస్ గా నడుచుకుంటూ వెళ్లి నమస్కారం పెట్టి న తర్వాత ఆయన మమ్మల్ని చూసి
" ఏరా !! దొంగ కోళ్లు పట్టే వాళ్ళలాగా అక్కడ నిలబడి ఏం చూస్తున్నారు, ఇంట్లోపలికి తగలబడచ్చు కదా" అన్నారు . మేం బిత్తరపోయిపోయి , బిక్కమొహంమొహం వేసుకుని రాని నవ్వు నవ్వుకుంటూ లోపలి కి చేతులు కట్టుకుని వెళ్లి పోయాం. ఆ విధంగా అన్నీ గమనించేవారు.
సాయంకాలం ఆఫీస్ పని అయిపోయిన తర్వాత భార్యను ,పిల్లలను కూర్చోపెట్టుకుని అందరూ కబుర్లు చెప్తూ ఉంటే వాడి నాన్న గారు కొద్దిగా వైన్ తీసుకునేవారు. ఆ సమయంలో పని ఒత్తిడి పూర్తిగా మర్చిపోయి కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ పిల్లలతో సరదాగా గడిపేవారు. మాకు డిగ్రీలు పూర్తయ్యే సమయానికి ఆయనకు కడప కు ట్రాన్స్ఫర్ అయింది.
కుటుంబమంతా అక్కడికి మకాం మార్చేసారు. ఇద్దరి కొడుకులను ,అంటే మా స్నేహితులను ,నిజాంబాద్ లోని ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ,అందులో అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోయారు. ఆ ఇంటి బాధ్యత, అంతా కూడా చిన్న కొడుకు కామేష్ కు అప్పజెప్పాడు. మేము కాలేజీలో అమ్మాయిలతో కలిసి వేసుకునే పి క్నిక్లు, సినిమా కార్యక్రమాలకి అయ్యే ఖర్చు , పాపం ఎక్కువగా కామేష్ భరించేవాడు. ఎందుకంటే అవి భరించడానికి మా ఆర్థిక స్తోమత సరిపోక పోయేది. మమ్మలిని తిడుతూ , వాడు తప్పనిసరిగా పాకెట్ లో నుంచి పర్సు తీసి నవ్వలేక నవ్వుతూ అమ్మాయిల ముందు చాలా స్టైల్ గా ఖర్చు పెట్టేవాడు. ఆ సమయంలో మమ్మల్ని చూసి గుర్రుమనే వాడు. మేమది చూసి ఫుల్లుగా నవ్వు కునే వాళ్ళం.
రెండు నెలలు గడిచిన తర్వాత వారి నాన్న గారు రూమ్ కు చెప్పా పెట్టకుండా రావడం జరిగింది
అది తెలిసి ఆ రోజు సాయంత్రం మేము భయపడుతూనే వాడి గదికి వెళ్ళాము . మేము వచ్చిన సంగతి గమనించి వాడు ఇంటిబయటకు వచ్చాడు . మొహం , కళ్ళు అంతా ఉబ్బి పోయి ఉన్నాయి. బాగా ఏడ్చినట్లు తెలుస్తోంది.
మేము కంగారు పడి "ఏంట్రా అలా అయిపోయింది నీ మొహం ? ఏంటి సంగతి"? అని అడిగాము . " వెధవల్లారా , మీరు చేసిన పనికి ,నాకు మా నాన్నగారు ఉదయం నుంచి వాయించి పెట్టారు. మీరేమో అన్నిటికీ నాతో ఖర్చు పెట్టిస్తారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి .....నే వ్రాసిన దొంగ లెక్కల ఖర్చు మా నాన్న పట్టుకొని, వాయించేసాడు .
నూనె ఖర్చు పది లీటర్లు రాసాను. అక్కడ దొరికి పోయా ". అన్నాడు కోపంగా .
"ఏరా మీ ఇద్దరికీ ఒక నెలలో 10 లీటర్ల మంచి నూనె ఖర్చయింది!!. ఏం చేస్తున్నారు? ప్రతిరోజు తలంటుకుంటూ ఉన్నారా? లేక ఒంటికి మర్ధన చేయించుకుంటున్నారా? . దొంగ వెధవల్లారా! దొంగ లెక్కలు!!! ఇంకోసారి ఇలాంటివి చేస్తే కాళ్ళు విరక్కొడతాను " అని దొబ్బులు పెట్టాడుట ..
"ఈ విధంగా, చాలా దొంగ లెక్కలని పట్టేసుకున్నాడు" అని చెబుతూ ఏడుపు మొహం పెట్టాడు.
అది విని మేము పగలబడి నవ్వి " అయినా దొంగ లెక్కలు చాలా కరెక్ట్ గా ఉండాలి రా! నెలకు పది లీటర్ల నూనె ఏంటి ?అసలు నీకు బుద్ధి లేదు, అవునూ, అన్నట్లు నువ్వు కామర్స్ విద్యార్ధి వి, పైగా కాలేజీ లో టాప్ ర్యాంకర్ వి కదా , మరి లెక్కల్లో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేవా ? వేస్ట్ ఫెలో." అని వాడి ని తిట్టాము.
కాలేజీ పరీక్షలు అయిపోయిన తర్వాత ఇల్లు ఖాళి చేసి అందరూ కడపకు వెళ్లి పోయారు. ఇక మాకు నిరుద్యోగ పర్వం మొదలయ్యింది . ఆ సమయం లో ,నేను ఒక మారు వాడి ఊరికి వెళ్లా. రాత్రంతా రైలు ప్రయాణం చేసి ,ఉదయాన్నే కడప స్టేషన్ లో దిగాను .
అలా ఉన్నఫలంగా, ఆ ఏబ్రాసి రూపంతో వెళితే వాళ్ళ నాన్నగారు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వరు అని నాకు తెలుసు. అందుకని రైల్వే స్టేషన్ లో స్నానాలు చేసి కొత్త ఇస్త్రీ డ్రెస్ వేసుకుని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్లి నమస్కారం పెట్టగానే ఆయన నన్ను ఆప్యాయంగా పలకరించి లోనికి పంపారు .
స్నేహితుడు కామేష్ నన్ను చూసి ఆశ్చర్యపోయాడు .ఇలా ఇంత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు ఈ ఊరికి , ఎలా వచ్చావు " అని ప్రశ్నలు వేసాడు .
"ఫ్రెషా ? నీ మొహం . స్టేషన్ లో దిగగానే ,అక్కడే స్నానం చేసి ,బట్టలు మార్చుకొని వచ్చాను ,మీ నాన్నగారి భయానికి " అని చెప్పాను. అది విని వాడి అన్నయ్య, అమ్మగారు, అక్కయ్య అందరూ తెగ నవ్వారు.
మరుసటి రోజు మేము భోజనం చేస్తూ ఉండగా ఎవరో వ్యక్తి బయట నుంచి కామేశ్వర్ నాన్న గారిని పిలిచాడు. ఆయన లేచి వెళ్లి గుమ్మం దగ్గర నిలబడి అడిగారు " ఏంటి బాబు? ఎవరు నువ్వు ?ఏం కావాలి ? "అని.
ఆ వచ్చిన వ్యక్తి " వుద్యోగం గురించి వచ్చానండి. మిమ్మల్ని కలవ మన్నారు" అన్నాడు .
"ఉద్యోగాలు నేను ఎక్కడి నుండి తేవాలి ? ఇదిగో ఇలా చూడు..మా ఇంట్లోనే ముగ్గురు బాగా దున్నపోతుల్లాగా తిని తిరుగుతున్నారు. వీళ్లకే ఉద్యోగాలు లేవు ఇక నీ కెక్కడ నుంచి ఇవ్వాలి ?" అని హాయిగా తింటున్న మమ్మలిని కొర కొరా చూసి లోనికి వెళ్లి పోయారు.
" ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లుగా , వాడెవడో ఉద్యోగానికి వస్తే మమ్మల్ని వాయించటం ఎందుకు" అని కామేష్ గొణిగాడు.
" అయినా ఆ వెదవ ఎవడో మేము తినే సమయానికె రావాలా ? వాడెవడో రావడం ఈయన అదే అదే పనిగా మిమ్మల్ని తిట్టడం " అంటూ అందరం గొణుక్కుంటూ తినడం మొదలుపెట్టాము. వాళ్ళమ్మగారు ఒకటే ముసి ముసి నవ్వులు మా బాధ , ఉక్రోషం చూసి.
మరుసటి రోజు ,అక్కడ ఉన్న భీమా సంస్థ లో ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్పటం వలన పుత్ర రత్నాలను ,అంటే, కామేష్ ,శ్రీనివాస్ , వారితో నన్ను కూడా వాళ్ళ నాన్న గారు కారులో తీసుకుని వెళ్లారు. అందరికంటే ముందుగా కారు దిగిన నేను , కార్ వెనక తలుపు తీసి వాళ్ళ నాన్నగారు దిగడానికి అనువుగా ఒక పక్కకు నిలబడ్డాను .నేను కార్ తలుపు తీయటం చూసిన వాళ్ళ నాన్నగారు కార్ దిగి ,ఆశ్చర్యంగా నన్ను ఆపాదమస్తకం ఒకసారి కళ్ళతో కిందా మీదా చూసి , కొడుకుల వైపు తిరిగి "ఒరేయ్ !! ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వీడు జీవితంలో చాలా పైకి వస్తాడు. వీడు సక్సెస్ అవుతాడు. " అని చెప్పి సీరియస్ గా ఆఫీస్ వైపు అడుగులు వేశారు.
ఆ మాటలు విన్న నేను ఆశ్చర్యంతో తలమునకలయ్యా.
ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడు , నేను నిరుద్యోగ సమయంలో ఎన్నో ఇబ్బందులను గెలిచి నప్పుడు కూడా ఆయన అన్న మాటలు గుర్తుకు వచ్చి విపరీతమైన మానసిక ధైర్యాన్ని పొందాను. ఉద్యోగ ప్రయత్నాలలో నేను విజయం సాధించ లేనప్పుడు కూడా ఆయన అన్న మాటలు గుర్తుకు వచ్చి అవి ఒక మంత్రం లాగా నా మీద పనిచేసి విజయం వేపు సాగేలా చేసేవి. ఆయన మాటల్ని నేను పూర్తిగా నమ్మాను. మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితుల మూలంగా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ ప్రతి సారి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆయన అన్న మాటలు మనసులో మెదిలి ,అవి తిరిగి నేను ఉత్సాహంతో పనులు చేసుకోవడానికి దోహదం చేసేవి.
ఆయన అన్న మాటలు నిజం చేసాను .భయంకరమైన బీదరికం అనుభవించిన నేను మంచి వుద్యోగం లో నిల దొక్కుకుని, కార్లు , విమానాలలో తిరిగే స్థాయి కి ఎదిగాను. దాదాపుగా నాలుగు దశాబ్దాలు దాటినా కూడా ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారు మ్రోగుతూ నే వున్నాయి.
అందుకే అన్నారు పెద్దల మాట చద్ది మూట అని.
కొద్ది కాలం కింద ఆయన పరమపదించారు. ఆయనకు నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు. వారి పేరు శ్రీ కె.జోగా రావు గారు.
విశాఖపట్నం వాస్తవ్యులు..విద్యుత్ శాఖ లో చీఫ్ ఇంజనీర్ గా రెండు జిల్లాలకు విధులు నిర్వ హించారు.

Ramani ramya
Give empl. Khammam
Great friendship and experience. Fantastic remembrance 👌
I remember Kamesh joined in MPC in 2nd year. Became jr in GGC and did bcom. 👏👍
[14/11, 16:21] Dr K SUDHAKER: It struck me when Sri joga Rao sir blessed you that you will come up in life.
It’s true blessing never go waste.
Hindu philosophy. Says
Telugu- asheerwadam ku minchina aasthi ledu. 🤝
: Yesterday was tatagaru bday.
My parents marriage anniversary too
జమానాను తలపిస్తూ.!అంత వ్యక్తిత్వం గల మనిషి మన మధ్య జ్ఞాపాకల హృదయం లో సజీవంగా వుంటూ మనల్ని
ఆశ్వీరదీస్తూ వున్నారని... విష్ణు.!
'పెద్దలమాట చద్దిమూట'👌
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి