అబ్దుల్ కలాం ; --గాంధీ నారాయణ MSc(physics),రిటైర్డ్ DSP

 భారతరత్న భారత్ ఏపీజే అబ్దుల్ కలాం వారి గురించి తెలియని వారు ఉండరు 
అయితే వారు క్లిష్ట పరిస్థితిలో సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు వారి మానసిక సంక్షోభం నుండి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అవి అతన్ని ఈ మార్గమున నడిపించాయి అనేది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. గొప్ప సంపద కలిగిన కుటుంబాలలో పుడితేనే గొప్ప వాళ్ళ మై పోతాము గొప్ప వాళ్లకి అవకాశాలన్నీ కలిసి వస్తాయనుకుంటే-- అది ఇది సామాన్యుడి అయినా అబ్దుల్ కలాం గారు భారతరత్న ఎలా  కాగలిగారు?
వారు తన జీవిత కథలు చెప్పదలుచుకున్నది ఏమిటంటే
" ఎవరు ఎవరు ఎంత చిన్నవాళ్లు కానీ ఎంత తక్కువ అవకాశాలకు కూడా నోచుకుని పేదవాళ్లు కానీ నిరాశ చందవలదు"
"ఎక్కడున్నాఒక పేద విద్యార్థి ఏ మారుమూల నో ఒక నిర్భాగ్య సామాజిక పరిస్థితిలో ఉంటున్న వాడైనా నా కథ చదివి ఎంతోకొంత స్ఫూర్తిని మరియు వోదార్పును పొందుతాడు అని నా ఆశ ఆవేదన"
 అబ్దుల్ కలాం గారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో మన మిత్రుడు గమనిద్దాం.
ఒక్కో సందర్భంలో మనం ఏమి నిర్ణయించుకోలేము.
మనం ఏం  కావాలి  అనుకున్నాము దానికై ఏం చదవాలి?  అని సరియైన అవగాహన లేనప్పుడు తీసుకునే నిర్ణయం కూడా అలానే ఉంటుంది.
తాను బి ఎస్ సి డిగ్రీ కోర్సులో చేరినప్పుడు ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్యత్ అవకాశాల గురించి తనకి ఏమీ తెలియదు .డిగ్రీ పూర్తి చేశాకే ఫిజిక్స్ తన subject కాదని గ్రహించాడు.
" తానేమైనా కావాలనుకుంటే దాన్ని గట్టిగా ఆకాంక్షించారు అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించిన నారు." కలలు కనండి ఆ కలలను  సహకారం చేసుకోండి "అనేది వారి నినాదం.
చిన్నప్పటినుండి  ఆకాశపు రహస్యాలనిన, పక్షిలా ఎగరాలనిన అమితాసక్తి, కొంగలు,  సముద్రపు గవ్వలు ఎగురుతండటం  చూస్తూ తాను కూడా ఎగరాలని కోరుకున్నాడు సాధారణ గ్రామీణ బాలుడై   అయినప్పటికీ తన ఆకాంక్షను నెరవేర్చుకునాడు.
 తన కలలను నిజం చేసుకోవడానికి చదవాల్సింది ఇంజనీరింగ్ అని అర్థం చేసుకున్నాడు. దానికై ఇంటర్మీడియట్ నేరుగా చేరవచ్చు.తన డిగ్రీ కోర్స్ నిర్వీర్యం అయిందని నిరాశ చెందలేదు .దక్షిణ భారతదేశంలోని సాంకేతిక విద్యకు తలమానికమైన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నోలజీ లో ప్రవేశానికి దరఖాస్తు  పెట్టుకొని,  దానికి ఎంపికయ్యాడు.
కోర్సులో అయితే జాయిన్ అయ్యాడు కానీ ఖర్చు తలకు మించిన భారమైంది తన సోదరి బంగారు ఆభరణాలను కుదువబెట్టి ఇచ్చిన డబ్బుతో చదువును ముందుకు సాగించగలిగాడు. స్కాలర్షిప్ సంపాదించ కపోతే చదువు సాగదని అర్థమైంది. తన మొదటి సంవత్సరం చదువు పూర్తి అయిన తదుపరి" పక్షిలాగా ఆకాశంలో వివరించాలని కాంక్షతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో చేరాడు "తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగి నాడు.
చాలా మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కీ సబ్జెక్ట్ ను సరిగ్గా ఎంచుకోక పోవడ ,ఎంచుకున్న సబ్జెక్టును క్రమబద్ధీకరించు కాకపోవడం వలన విఫలమవుతుంటారు .కాబట్టి విద్యార్థులు దీన్ని గ్రహించి నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా సాగిపో వలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
కామెంట్‌లు