నేటి బాలలే రేపటిపౌరులు ;-భరద్వాజరావినూతల(RB)-కొత్తపట్నం జిల్లా -ప్రకాశం 9866203795
 
ప్రక్రియ-సున్నితం--రూపకర్త -నెల్లుట్ల సునీత 

********* 
291) 
నేటిబాలలే కదా రేపటిపౌరులు 
భావిభారత నిర్మాతలు వారు 
సుగంధాలు విరిసే మొగ్గలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!**********
292)
కన్నోళ్ల  అనురాగపు ప్రతిరూపాలు 
క్రమశిక్షణ  వారికి నేర్పాలి 
వారిఅభివృద్దికి తోడ్పడాలి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!**********
293)
తిరిగిరానిది కదా బాల్యం 
ప్రే మతో పెరుగుతుంది నిరంతరం 
సత్ప్రవర్తన అవసరం దీనికి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!**********
294)
కాలరాయరాదు వారిహక్కులు 
కన్నోళ్ల  కలల దీపాలువాళ్ళు 
సాంప్రదాయాలకు రూపుగా పెంచాలి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!**********
295)
దేశభవితకు మూలస్థంభాలు 
ఛిద్రం చెయ్యరాదు  జీవితాలు 
కాపాడాలి వారిజీవితాలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!కామెంట్‌లు