*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౪౬ - 046)
 కందం:
*కసకసలు కాయగూరల* 
 *బుసబుసలగు రొంపనుండు బుడుతలయందున్*
*రుసరుసలు కోపియందును*
*గుసగుసలు రహస్యమందు గువ్వలచెన్నా!*
తా.: 
 కూరగాయలు కోసే టప్పుడు కస కస అని శబ్దం వస్తుంది.  చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు బుళుగు బుళుగు మని చప్పుడు వస్తుంది.  మనుషులకు కోపం వచ్చినప్పుడు రుస రుస అని చప్పుడు వస్తుంది.  రహస్యంగా మాట్లాడుతూ వుంటే గుస గుస శబ్దాలు వస్తాయి.......అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఈ పద్యంలో పట్టాభిరామ కవి తనలోని సరదా కోణాన్ని మనకు పరిచయం చేసారు.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు