*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౫౯ - 059)
 కందం:
*నిత్యానిత్యము లెరుఁగుచు* 
*సత్యంబగుదానిఁ దెలిసి సత్కృత్యములన్*
*నిత్యము జేయుచు దశది*
*క్త్సుత్యముగా మెలఁగుమన్న గువ్వలచెన్నా!*
తా.: ..  
 మనిషి అనే వాడు, ఏది శాస్వతము, ఏది అశాస్వతము అనేది తెలుసుకుని, సత్యమును తెలుసుకుని, సత్యముతోనే వుంటూ, పద్దెనిమిది దిక్కులలో శాస్వతముగా వుండే కీర్తిని సంపాదించుకుంటూ ఈ భూమి మీద వుండాలి.....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఇక్కడ ఈ ఐహిక ప్రపంచములో మనిషనే వాని కర్తవ్యం సత్యం లో, సత్యం తో, సత్యం గా బ్రతకడమే.  ఇక్కడ కనిపిస్తున్న రంగుల ప్రపంచము అశాస్వతమని తెలుసుకుని, సత్వ రజస్ తమో గుణాలను అదుపులో వుంచుకుని నిత్యము, శాస్వతము అయిన పరమేశ్వర తత్వాన్ని తెలుసుకునే నిత్య ప్రయత్నం, నిరంతరాయంగా జరిపే అవకాశం ఆ వృషభవాహనుడు మనకు అనుగ్రహించాలని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ .....*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు