*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - 14*
 *దీపదాన మహిమ*
*కాంపిల్యనగరం - యజ్ఞదత్త పండితుడు - కుమారుడు గుణనిధి - అతని ఆగడాలు, దురాచారాలు - తండ్రి కొడుకును వదులు కోవడం - గుణనిధి గాలికి తిరిగి పూర్తిగా చెడిపోయి - చివరికి అలసట తో ఒక చెట్టు మొదలులో కూర్చొని తన తప్పు తలచుకుని - కొంత పశ్చాత్తాపం కలుగుతుంది.*
*ఆ గుణనిధి కూర్చొని ఉన్న దగ్గరగా ఒక శివాలయం ఉండటం - ఆ రోజు శివరాత్రి పర్వదినం అవ్వడం -  అక్కడికి ఒక భక్తుడు అన్ని రకాల నైవేద్యాలు ఏర్పాటు చేసుకుని శివపూజకు రావడం - రోజంతా తినడానికి ఏమీ దొరకని కారణంగా ఉపవాసం ఉండడం - పూజ అయిన తరువాత బడలికతో శివ భక్తులు నిద్రలో ఉంటే - మన గుణనిధి ప్రసాదం తిందామని వెళ్ళి - అక్కడ కొండెక్క పోతున్న దీపపు ప్రమిదలో తన ఉత్తరీయం చింపి ప్రమిదలో వుంచి దీపం కొండెక్క కుండా చేస్తాడు - ప్రసాదం తీసుకుని వెళుతుంటే తన కాలు వేరొకరికి తగిలి పడతాడు - దొంగ అని నలుగురు నాలుగు దెబ్బలు వేస్తారు - మన కథానాయకుడు మరణిస్తాడు.*
*యమభటులు గుణనిధి కోసం వస్తారు - శివ గణములు వస్తాయి - ఇతడు శివ సన్నిధి లో దీపం వెలిగించిన పుణ్యం వల్ల మా శివలోకానికి వస్తాడు అని చెప్పి తమతో శివ సన్నిధికి తీసుకు వెళతారు.*
*భక్త సులభుడు కదా మన అంబాపతి. గుణనిధి యొక్క అవగుణముల ఫలితాన్ని ఒక్క దీపం వెలిగించడం వల్ల తొలగించి వేస్తాడు. అందుకే కార్తీక మాసములో దీపోత్సవానికి అంత ప్రాధాన్యత.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు