*శ్రీ శివపురాణ మాహాత్మ్యము - 15*
 శ్లో|| *నీ దయ వచ్చుదాక మరణించుట పుట్టుట తప్పదయ్యయో!*
*నీ దయ జూపకున్న కరుణించెడు వారెవరయ్య! నన్నిలన్,*
*నీ దయ ఏమిజేసినను, నెమ్మనమందున నమ్మి సర్వదా*
*పాదములంటి మ్రొక్కెద నపారకృపామయ చంద్రశేఖరా!*
              ... శవలింగ విలాసము
*శివ పురాణము లో ధర్మార్ధకామమోక్షములు చక్కగా వివరింప బడ్డాయి. అనంతమైన ఈశ్వర విభూతి, పావనమైన శివపార్వతుల లీలా చరిత్రము అందముగా చెప్పబడ్డాయి. శివభక్తి, లింగ మహిమ గురించి సర్వోత్కృష్టముగా వివరించ బడింది. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములు పోగొట్టి, తనను ఆశ్రయించిన వారికి శుభములు చేకూర్చును. శివభక్తులు ఉత్తమగతులు పొందగలరు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు