*అనుభవాల గూడు...17*(*కథా మణి పూసలు*);----బొమ్ము విమల-మల్కాజ్ గిరి,,,9989775161.
రామయ్యనె ఒకప్పుడును
బాగా బ్రతికినవాడును
కొడుకులు ఛీదరించంగ
పొరుగూరికెళ్ళిపోయెను

నాలుగిళ్ళను అడుక్కని
ఓ అరుగునా పెట్టుకుని
తిని అక్కడుండెవాడు
సేద తీరును పండుకొని

ఆ అరుగుకు ఎదురుగాను
సోమయ్యది ఇల్లుండెను
ఆయనకు చాలా పొలం
ఊరి చెంతనే ఉండెను

వేయవలసిన పంటలు
వేయవలసిన ఎరువులు
తగిన సలహాలనెన్నో...
ఇచ్చేవాడు సూచనలు

ఆయన పాటించెవాడు
అధిక ఫలం పొందెవాడు
సోమయ్య డబ్బు దాచి
పెద్ద మిద్దె కట్టినాడు

డబ్బు బాగ వచ్చినాది
హోద బాగ పెరిగినాది
పెద్ద పెద్ద వాళ్ళతో...
బాంధవ్యం పెరిగినాది

ఇంటికందరు రావడము
విందులెన్నో చేయడము
రోజు కోలాహలంగా....
సాగుచుండెను జీవనము

ఒకానొకా రోజునందు
నువ్వే మా ఇంటి ముందు
ఉండడం ఏమి కూడ....
మా వాళ్ళకు నచ్చలేదు

సోమయ్య భార్య చెప్పెను
మాకున్నా దొడ్డిలోను
నీవు ఉండుట మంచిదని
ఖరాఖండిగా చెప్పెను

కమల చెప్పింది నిజము
అందమైనట్టి భవనము
ముందు దిష్టి బొమ్మల నే
ను,ఉండుట కాదు ధర్మము

అనుచు మకాం మార్చినాడు
దొడ్డిలోన చేరినాడు
కొంచెము నొచ్చుకున్నా...
అక్కడె తానుండినాడు

ఒక రోజున రామయ్యను
అన్నం కొఱకై వెళ్ళెను
అప్పుడు కమలమ్మ  గారు
తినటానికై కూర్చునెను

కమల కంచమ్ములోను
మాంసం కూర ఉండెను
తినుటకు సిద్ధం కాగ...
రామయ్య ఆగుమనెను

కమల కళ్ళను జూసెను
పచ్చగా ఉన్నాయనెను
పెద్ద వాణ్ణి చెప్పుతున్న
ఇప్పుడు మాంసమొద్దనెను

సరేననుచు కమల గారు
తినడము మానేసినారు
పెద్దాయన మాటకు...
విలువనామె ఇచ్చినారు

మరునాడు ఉదయమేను
వెజ్జుని చేర పోయెను
రామయ్య అన్న మాటలు
వైద్యునితోన చెప్పెను

పచ్చ కామెర్ల వ్యాధి
నీకు బాగ ముదిరినాది
మాంసం తినక పోవడము
చాలా మంచిదైనాది

ఒక వేళ తిని ఉంటేను
నేనూ బ్రతికించ లేను
ఆ భగవంతుడు కూడ
బతికించె వాడు కాదును

అని వైద్యుడు చెప్పినాడు
వైద్యమునే చేసినాడు
పది రోజులకు సరిపోయె
మందులు రాసిచ్చినాడు

కమల మందులు వాడినాది
జాగ్రత పాటించినాది
పది రోజులు వాడినాక
వ్యాధి నయం అయ్యినాది

తాత వద్ద చేరినాది
మా ఇంటికే రమ్మంది
మాకు పెద్ద దిక్కుగాను
ఉండుమనుచు వేడినాది

అలాగె తల్లి అన్నాడు
వారి మార్పును చూసాడు
తాతకు అర్థం కాక........
తలనేను పీక్కున్నాడుకమల తాత నాదరించి
ఒక గదినే అప్పగించి
తాత ఇచ్చె సూచనలను
ఎల్ల వేళలు పాటించి

జీవితంలో వెలుగులను
బ్రతుకులోన మెళుకువలను
తాత ద్వార తెలుసుకొని
ఉన్నత స్థితికి ఎదిగెను

కామెంట్‌లు