గణపతి. (పురాణ బేతాళ కథలు. 1.);-సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.


 పట్టువదలని విక్రమార్కుడు శవంలోని బేతాళుని బంధించి భుజంపైన వేసుకుని నడకూసాగించాడు.
శవంలోనిబేతాళుడు'మహారాజాభులోకం,భువర్లోకము,సువర్లోకము,మహాలోకము, జనలోకము,తపోలోకం,సత్యలోకము అంతాటా నీన్ను కొనియాడుతున్నారు. అభినందననీయుడవే, నాకు గణపతి గురించి చెప్పు తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు 'అన్నాడు.
' బేతాళా గణపతి జననం మనకు తెలిసిందే ! తెలియని కొన్నివిషయాలు తెలుసుకుందాం !
భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోను, అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపలపలు దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.
వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు - ఏనుగు ముఖం, ఎలుక వాహనం అడ్డంకులు తొలగించే గుణం, విద్యా, బుద్ధి ప్రదాత . ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి) ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం.
వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ క్రీ.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది. తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు - గణేశ పురాణము, ముద్గల పురాణము, గణపతి అథర్వశీర్షము
భారతీయ శిల్ప, చిత్ర కళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా,
క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలెలోని కంటకచైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు, ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపబడింది. 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తరువాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తరువాత - అంటే 900-1200 కాలం తరువాత - వినాయకుని ఆకారం సాధారణంగా కుడిప్రక్క చూపిన విగ్రహంవలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బానపొట్ట, ఒకచేత విరిగిన దంతం, మరొకచేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం - ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన (7వ శతాబ్దానికి చెందిన) గణేశ విగ్రహం లభించింది కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడంలేదు. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒకచేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒకచేత దంతం, మరొకచేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతి బదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు. నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు
ఆదినుండివినాయకుడినిఏనుగుతలతోనేచిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది.
 ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.
వినాయకునికి ఏక దంతుడు అన్న పేరు మొదటి నుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం". అలాగే పెద్ద పొట్ట కూడా మొదటి నుండి (గుప్తుల కాలంనుండి) వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం. ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలు (హేరంబుడు, మహోదరుడు) ఈ పెద్దపొట్ట అనే అంశంయొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది. వినాయకునికి రెండు చేతుల నుండి, 16 చేతుల వరకు చూపుతారు. సాధారణంగా నాలుగు చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు. పురాతనమైన విగ్రహాలలో మాత్రం రెండు చేతులనే చూపారు. 9వ, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతుల వరకు ఉన్న ప్రతిమలు చెక్కారు. వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది. గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి (పాము) ని తన కంఠానికి చుట్టుకొన్నాడు. మరి కొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది. ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా (మొలతాడు లాగా), చేతిలో ఉన్నట్లుగా, కాళ్ళవద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా - ఇలా అనేక విధాలుగా చూపబడింది. వినాయకుడి నుదురు మీద తిలకం, కొన్ని సార్లు మూడవ నేత్రం చూపుతారు. గణేశ పురాణం ప్రకారం వినాయకుని తల మీద తిలక చిహ్నం, చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారు.
వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంథంలో చెప్పబడింది. ఉదాహరణకు హేరంబ గణపతిని, ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపుతారు.
అధికంగా వినాయకునికి వాహనంగా ఎలుకను చూపుతారు. మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయక విగ్రహాలలో వాహనాన్ని చూపలేదు. ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతారాలు చెప్పబడినాయి. (వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు). ఆ ఎనిమిది అవతారాలలో ఐదు అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనంసింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం. మయూరేశ్వర అవతారం నెమలి. ధూమ్రకేతు అవతారం గుర్రం. గజాననుని అవతారం ఎలుక. పలుసంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి. (చూపబడినాయి) . 
7వ శతాబ్దం నుండి మధ్య, పశ్చిమ భారతంలో వచ్చిన శిల్పాలలో ఎలుకను చూపడం మొదలయ్యిందని  లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక వాహనం గురించి వ్రాయబడింది. తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయం ఉంది. చివరి అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశపురాణంలో ఉంది. గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజంమీద ఎలుక ఉంటుంది. గణపతి సహస్రనామాలలో "మూషిక వాహన", "అఖుకేతన" అనే పేర్లున్నాయి.
ఎలుక వాహనం సంకేతాన్ని అనేక విధాలుగా వివరిస్తారు - ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం. పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి. ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని (సర్వాంతర్యామి) మరొక అభిప్రాయం ఉంది.
హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. (ముఖ్యంగా దేవనాగరి, లిపిలలో)  గణపతి అధర్వశీర్షంలో ఈ విషయం ఇలా ఉంది:
గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము,స్వర్గము.నీవేఓంకారముకుండలినీయోగము ప్రకారము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు. గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమై చెట్టుపైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.

కామెంట్‌లు