"సజ్జనులు-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.

తే.గీ.
సజ్జనులతోడచెలిమినిసాగునటుల
చేయవలెనండినిరతమ్ముశ్రేష్టతలరు
వారిసాంగత్యమనునదివదలరాదు
బంధమన్నదిపెంచుకోప్రతిదినంబు!!!

02.

తే.గీ.
పసిడిమార్గమ్ముజూపించిఫలితమొసగి
మేలుగోరుచు,పనులలోశ్రీలుకురియు
నటులనీవెంటనుండియుపటుతరముగ
బాధ్యతలనెరవేర్చునువసుధపైన!!!

03.

తే.గీ.
మంచియుపదేశమొనరించి‌,మంచిచెడుల
తారతమ్యమ్ముదెలిపియు,దాచకుండ
జ్ఞానమునుబోధజేసియుపూనితముగ
మాన్యులుగతీర్చిదిద్దునుమరచిపోక!!!
కామెంట్‌లు