"భరతభూమి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.
పాడిపంటలతోడనుభరతభూమి
పరిఢవిల్లుచునుండునునిరతముగను
సస్యశ్యామలమైయొప్పిసంపదలను
కలిగియుండియుకీర్తితోవిలువనొందు!!!

02.
తే.గీ.
దేశసంస్కృతులనుచాటిదిశలవెల్గి
విభవమొందుచువిజ్ఞానవిరులుజల్లి
శాస్త్రసాంకేతికారంగసంబరములు
జరుపుకొనుచుండుమెండుగాతరతరాల!!!

03.
తే.గీ.
వేదభూమిగావిలసిల్లిపేరుపొంది
రత్నగర్భగామనమాతరాణకెక్కి
భారతీయతజాతీయభావనలను
నిలుపుకొన్నట్టిసుందరనీలవేణి!!!
కామెంట్‌లు