"అంతర్జాతీయవికలాంగులదినోత్సవము-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
వికలాంగులజూచిమనము
పకపకనవ్వంగరాదుపాపముయౌనే?
సకలముదైవాదీనము
తికమకలాడకనుసతముదీర్చుముబాధల్ !!!

02.
కం.
అవయవలోపములున్నను
సవినయముగసేవలెన్నొచాలగజేయన్
భువిపైనరులునుమెచ్చును
నవయువకులుతోడునుండనందనవనమౌ!!!

03.
కం.
కనబడవినబడజనముల
మనమునునొప్పించరేనిమంచిదిగాదే?
అనుదినముకుంటిమూగకు
తనువొంగినగూనిపట్లదయజూపవలెన్!!!

04.
కం.
పింఛనులిచ్చుచుప్రభుతయె
మంచిగసదుపాయములనుమహిలోగూర్చెన్
మించగవికలాంగులకును
వంచనలేకుండజేసివరములనొసగెన్!!!

05.
కం.
అంధులఆశాజ్యోతిగ
బంధువుయైవచ్చిలూయిబాసటనిల్చెన్
గంధముగాలిపిగనుగొని
బంధముగాయల్లుకొనియుబాధలదీర్చెన్ !!!


కామెంట్‌లు