"భారతరత్న మాన్యశ్రీ డా.భీంరావ్ రాంజీ అంబేద్కర్ వర్థంతి-పద్యాంజలి"!!!;"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.
"బాల్యమందునయెన్నెన్నొపాట్లుపడియు"
"స్వీయప్రతిభతోయెదిగినశ్రేష్ఠుడతడు"
"బాధలవమానములనెన్నొవదిలిపెట్టి"
"గెలిచిఅంబేద్కరుడుగారునిలిచెజగతి"!!!

02.
కం.
భీమాబాయ్ రాంజీలకు
ప్రేమామృతఫలమునయ్యిపెన్నిధిగూర్చెన్
 క్షేమంబుగనంబేద్కరు
ధీమాగావిద్యనేర్చిధీరుండయ్యెన్!!!

03.
 కం.
తొలిన్యాయశాఖమాత్యులు
సలలితముగరాజకీయ సంద్రమునందున్
విలువలకైపోరాడియు
మెలిగినఅంబేద్కరుండుమేధావియెగా!!!

04.
కం.
పండితుడంబేద్కరుడే
దండిగరాజ్యాంగరచనధరణినిజేసెన్
మెండుగనతులొనరింతును
గుండెలలోకొలువునున్నకోవిదునకునన్!!!
కామెంట్‌లు