చిత్రానికి పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
పలుకులన్ గాంచ వ్యత్యాసములికి పడును
కాన వచ్చెను చిత్రాన కలకలమున
వదలబోకంటు చెప్పేడి యెదను జూడ
సడలి పోయెనే ధైర్యము సౌఖ్య మెచట
తే.గీ
బడిన దింపేను తండ్రిగా ఫలమునెంచి
ఫలిత మందిన పుత్రుని బలముగాంచ
ప్రేమ వంచించ బడుచున్న బేలతనమె
నన్ను వదిలేయకంటుండె నాన్న మనసు
తే.గీ
కూర్మి లేకుండ బోయిన కుటిల తనమొ
నెగ్గ లేనట్టి బాధల నీడ లందు 
సిగ్గు పడకుండ తండ్రికి పగ్గ మేయ
వృద్ధులాశ్రమంబుకు దోల సిద్దపడెను


కామెంట్‌లు