చిట్టితమ్ముడు( బాల గేయం);-మమత ఐలకరీంనగర్9247593432
కప్పగంతులేయకుర చిట్టితమ్ముడు
బడికి వెళ్ళుదాము మనం బ్యాగుతీయవు
చదువులలో విజ్ఞానం దాగిఉండెను
పల్లెనంత బాగుజేయ పైకివద్దము

నత్తనడక నడవకుర చిట్టితమ్ముడు
విత్తము చిత్తమ్ముగదా ఆచరించుము
స్వచ్ఛమైన బాటమనకు చదువు నేర్పును
సఖ్యతంటె ఏమిటో గురువు చెప్పును

పుచ్చిపొయిన పండ్లన్ని చిట్టితమ్ముడు
మట్టిపాలె యౌతుండె చూడవెందుకు
పసిడివన్నె రంగులున్న పండ్లు చూడుము
మనవలెనే మెరియుచుండె హారగించను 

పరులసేవ జేయుటకై చిట్టితమ్ముడు
పందిరివలె ఎదుగుదాము మనము ఇప్పుడు
పంటలోని పచ్చదనం భవిత యెప్పుడు
భాగ్యరేఖ మనదేర కదులు ముందుకు

***************************


కామెంట్‌లు