చిత్రానికి పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 కం.
పొగవోలె మంచు కురిసిన
తగని చలికి వణుకు తోడ తరలిరి జనులే
జగమాగున పొగమంచుకు
రగడేగదజీవితంబు రక్షకు శివుడే
కం.
కనుమరుగున వృక్షంబులు
పనిబాటను కప్పెమంచు పందిరి వోలెన్
ధనమాపున కాలంబును
జనవాహిని వణుకులోనె సాగిరిగాంచన్

కామెంట్‌లు