పద్యాలు ; -మమత ఐలహైదరాబాద్9247593432
 న్యస్తాక్షరి:- ఆ.రా.మ.ము
తే.గీ
ఆత్మ పరమాత్మ దేనని నందురెపుడు
రామ నామంబు జపియించి రమ్యముగను
మరపు రాకుండ హృదయాన మారుతపుడు
ముత్యముగనిలిపెన్ గద సత్యమూర్తి

 న్యస్తాక్షరి:- శ్రీ. శ్రీ. రా.రా 
కం.
శ్రీమణ్నారాయనుడే
శ్రీమహ లక్ష్మిని వెదకుచు చేరెను వకుళన్
రామాయణమందు శబరి
రామునిగాంచిన విధమనురాగము జూపెన్

కామెంట్‌లు