పద్యాలు ; -మమత ఐలకరీంనగర్9247593432
 దత్తపదులు:-హా.హా.కా.రం పాదాదుల్లో
తే.గీ
హాయి గొల్పంగ వేడుము హరిని యెపుడు
హాని పొంచగన్ గాంచుము యడుగడుగున
కాని మాటలన్ విడువుము కార్యమందు
రంపమైనను వంగులే రణములోన
దత్తపది:- సంత.వింత. కంత.బొంత
ఉ.
సంతన కోతులాటలని సర్కసు బెట్టగ చూడబోతిమే
వింతలు జూపుచుండెనవి వీటికి వాటికి చిచ్చుబెట్టుచున్
కంతకు చువ్వ గుచ్చుకొని కాల్చగవచ్చెను ప్రక్కకోతినే
బొంతను తెచ్చి కప్పుకునె భోరున యేడ్చెను వానరంబటన్

కామెంట్‌లు