వేడిని గుర్తించే జంతువులు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445
  గుడ్ల గూబ,పాములు,కొన్ని రకాల జంతువులు నిశాచరులు.అంటే అవి రాత్రుళ్ళు తిరుగుతూ ఎగురుతూ చీకటిలో ఎలుకలు,ఉడతలు మొదలైన చిన్న జంతువులను పట్టి చంపి తింటాయి! మరి చీకటిలో అవి ఏ విధంగా చూడగలుగుతున్నాయి?
      ప్రతి జంతువులో కొంత వేడి ఉంటుందని తెలుసుకదా! ఆ వేడినుండి కంటికి కనబడని 'ఇన్ ఫ్రా రెడ్' కిరణాలు ఉత్పత్తి అవుతాయి.పక్షులు, జంతువులే కాకుండా మనుషులు కూడా ఈ కిరణాలను ఉత్పత్తి చేస్తుంటారు.
       ఇటువంటి ఇన్ ఫ్రా రెడ్ కిరణాలు గుర్తించగలిగిన శక్తిని కొన్ని రకాల తాబేళ్ళలో కూడా గుర్తించారు.ఇక పాముల్లో నాలుగు ముక్కు రంధ్రాలు ఉన్నట్టు కనబడతాయి! అనేక సంవత్సరాలు శాస్త్రజ్ఞలు ఈ నాలుగు ముక్కుల అమరిక పై పరిశోధనలు సాగించారు.ఈ నాలుగు ముక్కుల పాముల్ని 'క్రోటోలికా'  కుటుంబంలో చేర్చారు.ఇటువంటి పాములు ఉత్తర,దక్షిణఅమెరికాలలో, ఏషియా దేశాల్లో కనబడతాయి.ఈ నాలుగు ముక్కులలో క్రింది రెండు ముక్కులకు రంధ్రాలు ఉండవు,గుంటల వలె ఉండి సన్నటి పొరతో కప్పబడిఉంటాయి.
      1937లోఅమెరికాకుచెందినడి.నోబెల్,ఎ.స్కిమిట్ లు విస్తృత పరిశోధనలు జరిపి గుంటల వలె ఉండేవి కేవలం ఇన్ఫ్రా రెడ్ కిరణాలు గుర్తించే అవయవాలుగా(thermolocators) గా గుర్తించారు. చీకటిలో వెలుగుతున్న బల్బులకు నల్లటి కాగితం చుట్టి పాముల వద్దకు తీసుకవెళుతుంటే అవి దూరంనుండే ఆ వేడిని గ్రహించి ఆబల్బుల వద్దకు పాకి బల్బును కాటు వేసినట్టు శాస్రజ్ఞులు గమనించారు. అదే చీకటిలో వెలగని బల్బుతెస్తే పాములు గుర్తించలేక పొయ్యాయి!
      35 సెం.మీ దూరంలో 0.2°సెం.గ్రేడు కంటే ఎక్కువ వేడిగల వాటిని అవి గ్రహించగలవని వారి పరిశోధనల్లో తేలింది.
      1952 లో టి.బులక్, కౌల్స్ అనే శాస్త్రజ్ఞులు పాములకు వేడిని గుర్తించే అవయవాలను తొలగించి పరిశోధనలు చేశారు.నరాలు తొలగించిన పాములు అసలు వేడిని గుర్తించలేక పొయ్యాయి. కానీ పాముల చుట్టూ ఉన్న వాతావరణంకన్నా ఎక్కువ వేడిగల జంతువులను మాత్రమే గుర్తించగలవని పరిశోధనల్లో కనుక్కున్నారు.
       ఇదండీ పాముల మరికొన్ని జంతువుల వేడిని గుర్తించే శక్తి విశేషాలు.
                   *************
ఆధారం: ఆనిమల్ ట్రావెలర్స్
               ఇగర్ అషిముష్కిన్
***********************************


కామెంట్‌లు