చదువుకొని హాయిగా నవ్వండి;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   నెక్లెస్
      ******
ఓ దొంగ దొంగలించిన నెక్లస్ ని నగలవ్యాపారి వద్దకు తీసుకవెళ్ళి పరీక్షించి వెల చెప్పమన్నాడు. ఆ వ్యాపారి నెక్లస్ ని పరీక్షించి, అతనిని కూర్చోమని చెప్పి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు....
     "సార్,నా భార్య నెక్లస్ దొంగలించిన దొంగ నా దగ్గరే ఉన్నాడు.ఇక మీదే ఆలస్యం"
                 ***********
              చెట్టు
             *******
    'మీరు కట్టే ఇంటిలో కనీసం ఒక చెట్టు పెంచండి' అని ప్రభుత్వం గోడ మీద వ్రాయించింది.
     'నాకో ఇల్లు ఇవ్వండి నేను ఐదు చెట్లు పెంచుతాను' అని దాని క్రింద ఎవరో వ్రాశారు!
               ***********
       రంగు మారింది
       *************
     ఓ టీచర్ కొత్తగా చేరిన విద్యార్థులకు రసాయన శాస్త్రం బోధిస్తూ రసాయనిక చర్య ప్రత్యక్షంగా చూపడానికి ఓ రసాయన పదార్థాన్ని గాజు కుప్పెలో పోసి దానిలోకి తన నోటితో గాలి ఊదాడు. వెంటనే అందులోని ద్రవం పసుపు రంగులోకి మారింది!
      "ఇప్పుడు చెప్పండి దీనికి కారణం?" అడిగాడు ఉపాధ్యాయుడు.
       "నోటి దుర్వాసన" వెనుక బెంచీలోని విద్యార్థి చెప్పాడు.
               *******************
     ఓ రోజు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించ డానికి తన మనవడిని తీసుకొచ్చింది బామ్మ.వాడు పొడవాటి జులపాల జుత్తుతో చిత్రంగా ఉన్నాడు.   ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు ఇచ్చే డాక్టర్ని
     " నాయనా వీడికి మత్తు మందిచ్చి ఆపరేషన్ చేయటమే కాదు, ఆ జుత్తు కూడా కత్తిరించేయండి మరికొంత డబ్బు ఇచ్చుకుంటాను" తాపీగా చెప్పింది బామ్మ.
      కుర్రాడి మొహంలో రంగులు మారాయి.
                 ***********
     నవ్వడానికి మొహంలో 17 కండరాలు ఉపయోగిస్తాము.అదే కోపం వచ్చినపుడు 43 కండరాలు ఉపయోగిస్తాము!
                  ************

కామెంట్‌లు