రమాలు లేక చేతిగుడ్డ;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  రుమాలు లేక చేతిగుడ్డ ఆంగ్లంలో హాండ్కర్ ఛీఫ్ అని తెఉసుకదా.దీని ఉపయోగం శతాబ్దాలనుండే ఉన్నట్లు పాత పెయింటింగ్ లను పరిశీలిస్తే తెలుస్తుంది. మనదేశంలో పూర్వంనుంచి భుజం మీద తుండుగుడ్డను వేసుకుని సంచరించడం మామూలే.మెల్లమెల్లగా జనం రుమాలు వాడటం అలవాటు చేసుకున్నారు. ఇప్పటికీ పల్లెటూరు వాళ్ళు భుజం పై తుండుగుడ్డను వాడుతున్నారు.
        రుమాలు ఉపయోగం ఇంతా అంతాకాదు కేవలం చెయ్యి తుడుచుకోవడానికే కాదు,జలుబు ముక్కుకి అసరాగా,దగ్గునోటికి అడ్డంగా,నుదుటి చెమటను తుడుచుకోవాలన్నా,అలసట అనిపించినపుడు రుమాలుతో మొహం రుద్దుకుంటే ఉపశమనం లభిస్తుంది! జిడ్డు పట్టిన మొహాన్నిరుమాలుతో తుడుచుకుంటే కొంత ఆహ్లాదం లభిస్తుంది. 
         రుమాళ్ళు వివిధ డిజైన్లలో సైజుల్లో  లభిస్తున్నాయి.  చిత్రకళలో ప్రవేశమున్న వారు తెల్లటి,లేతరంగుల రుమాళ్ళ మీద అధ్బుత డిజైన్లు సృష్టిస్తున్నారు.చిన్న పిల్లలకి, స్త్రీ ఉద్యోగస్తులకి వివిధ రకాల రుమాళ్ళు లభిస్తున్నాయి.
      ఒకరి రుమాలు ఇంకొకరు వాడకూడదు. మగవారు ముదురు లేక గళ్ళు ఉండే కాటన్ రమాళ్ళు 30×30 సెంమీ. సైజులో వాడితే బాగుంటుంది.కాటన్ రుమాళ్ళు చెమటను బాగా పీలుస్తాయి.
       విచిత్ర మైన డిజైన్లు,రంగులు ఉన్న రుమాళ్ళు ఉపయోగించకూడదు.మనం రుమాలు వాడేటప్పుడు ఆయా డిజైన్లు,రంగులు ఎదుటి వారికి మన మీద ఉన్న అభిప్రాయం మార్చవచ్చు! 
       చాలామంది రుమాలును ఉండలాగ చుట్టి జేబులో కుక్క తుంటారు.ఈ విధంగా చేయకూడదు.జేబు ఎత్తుగా అసహ్యంగా కనబడుతుంది.రుమాలు ముడతలు పడిపోతుంది.
     ఆరోగ్యవంతుడు రుమాలు రెండురోజులకంటె ఎక్కువ ఉపయోగించకూడదు.అసలు ఇంటికి వస్తూనే రమాలును ఆరవెయ్యాలి.తడి రుమాలు జేబులో వదలివెయ్యకూడదు.జలుబులేక దగ్గు ఉంటే రుమాలును ప్రత్యేకంగా ఉతకాలి.సాధ్యమైనంత వరకు ఆంటీ సెప్టిక్ లోషన్  (డెట్టాల్) లోతడిపి ఆరెయ్యాలి. వీలైతే రుమాళ్ళను బట్టల సబ్బు కాకుండా, మంచి సువాసన గల స్నానం సబ్బుతో ఉతికితే రుమాలు మంచి వాసనతో ఆహ్లాదంగా ఉంటుంది.
       చిన్నపిల్లలకు కూడా రుమాలు వాడకం విధిగా నేర్పించాలి.వాళ్ళకు సుమారు 20×20 సెంమీ.రుమాలు ఇస్తే బాగుంటుంది.రమాళ్ళ మీద మిక్కీ మౌస్ వంటి బొమ్మలు ఉంటే బాగుంటుంది.
     ఇప్పడు బతిక్ పెయింటింగు రుమాళ్ళు కూడా వస్తున్నాయి.రుమాలు చివర్లలో  పేరు లోని మొదటి అక్షరంతో పాటు చిన్న డిజైన్ స్త్రీలు కుట్టు కుంటే బాగుంటుంది.
       సాధ్యమైనంత వరకు ఫ్యాబ్రిక్ పెయింటితో రుమాలు మీద చిత్రం వేయకండి, రుమాలు ఎక్కువ వాడకం వలన ఆ పెయింట్ దెబ్బతినవచ్చు.
       ఆఖరున ఒక్కమాట...చాలామంది మార్కెట్టుకు సంచి మరచిపోతే కూరగాయలు,పండ్లు రుమాలులో కట్టి తీసుకొస్తుంటారు.దయచేసి ఆ పని మానెయ్యండి.రుమాలు కేవలం రుమాలుగానే ఉండాలి,అది ఆరోగ్య దాయకం-రుమాలు సంచీ కాకూడదు!
              *********

కామెంట్‌లు