మూఢ భక్తి;-..కనుమ ఎల్లారెడ్డి-93915 23027

 కాంతయ్య,ఆనందయ్య పొలాలు ప్రక్క ప్రక్కనే.కాంతయ్య పొలంలో విత్తనం వేసిన తర్వాత అదే మొలకెత్తుతుంది అని పూజలు చేసేవాడు.విత్తనం మొలకెత్తింది కాని కలుపు విపరీతంగా పెరిగింది.ఎవరితోనయినా కలుపు తీయించు అని చెబితే అన్నీ దేవుడే చూసుకుంటాడు అనేవాడు.ఆనందయ్య కాంతయ్య పొలంలో ఉన్న కలుపు చూసి బాధపడ్డాడు.పంట చూస్తే బాగుంది.ఈ కాంతయ్య కలుపు తీయిస్తే ఇంకా బాగుంటుంది అనుకుని కాంతయ్య దగ్గరకు వెళ్ళి పిలిచాడు.పూజ లో ఉన్న కాంతయ్య ఆ పిలుపు వినపడిన కూడా "వెళ్ళు, వెళ్ళు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఆనందయ్య వెళుతూ " రెండు రోజులలో కలుపు తీసుకోకపోతే చేతికి వచ్చిన పంటంతా నాశనం అవుతుంది" అని గట్టిగా వినపడేలా చెప్పాడు.
"ఆ, ఆ నాకు తెలుసు వెళ్ళు " అని విసురుగా చెప్పి పూజలో మునిగిపోయాడు. "దేవా నాపొలం ఉండే కలుపంతా పోవాలి మీరే ఈ పని చేయాలి "అని వేడుకున్నాడు.ఆనందయ్య పొలం  విరగ కాసింది.పంటనంతా ఇంటికి చేరుస్తున్నాడు.
కాంతయ్య పొలంలో కలుపు ఏపుగా పెరిగి పంటంతా నాశనమైంది.రెండు రోజుల తర్వాత కాంతయ్య పొలం కు వస్తే కలుపు తో
పంటంతా పోయింది.దానిని చూస్తూ దిగాలుగా కూర్చున్నాడు.అప్పుడే ఆనందయ్య
వచ్చి "నేను చెబితే విన్నావు కాదు.నీ మూఢభక్తి తో పంటను చేజేతులా నాశనం చేసుకున్నావ్.భక్తి ఉండాల్సిందే.కాని మూఢభక్తి కాదు.అన్నీ దేవుడే చూసుకుంటాడు అనుకోవడం నీ మూర్ఖత్వం.
మనం కష్ట పడాలి.మన కష్టమే మనకు నమ్మకం అంతే కాని భక్తి కాదు." అన్నాడు.
నిజమే అనుకుని ఆ రోజు నుంచి కష్టాన్ని నమ్ముకున్నాడు.
                  ***

కామెంట్‌లు