ముని యుక్తి (కథ);-...కనుమ ఎల్లారెడ్డి93915 23027

 విష్ణుపురంలో  దూరంగా ఓ ముని ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ వుండే వాడు. ఓ రోజు ఆశ్రమం బైట తపస్సు చేసుకుంటుండగా ఓ దొంగ నగల మూటతో ఆశ్రమం ప్రక్కగా పారిపోయాడు.అది చూశాడు ముని.ఆ వెంటనే రాజ భటులు వచ్చారు. మునిని చూసి " ఇటువైపు ఎవరైనా వచ్చారా స్వామి " అని అడిగారు. మునికి గొప్ప చిక్కు వచ్చి పడింది. ఈ వైపు వెళ్ళాడు అంటే భటులు వాడ్ని పట్టుకుని చంపేస్తారు. నేను చూడ లేదు అంటే అసత్య దోషం వస్తుంది అనుకుని ఆ ముని వారిని చూసి " నాయనలారా! చూసే కళ్ళు చెప్పలేవు.చెప్పే నోరు చూడలేదు " అన్నాడు. ముని మాటలు వారికి అర్ధం కాక నమస్కారం చేసి వెళ్ళారు. ఆ విధంగా అసత్య దోషం రాకుండా దొంగకు ప్రాణగండం లేకుండా తప్పించాడు.
.
కామెంట్‌లు