ధనవంతుడు;-...కనుమ ఎల్లారెడ్డి--93915 23027.

 శ్రీపురం లో భూషయ్య పెద్ద ధనవంతుడు. అయితే దాన ధర్మాలు ఏవి చేసేవాడు కాదు.తను సొంతంగా తవ్వుకున్న బావి నుంచి కూడా మంచినీళ్లు ఎవరిని తీసుకుపోని  చే వాడు కాదు.మంచి నీటి కోసం ఊరి ప్రజలు
రెండు కోసుల దూరం నుంచి నీరు తెచ్చుకునేవారు. ఎంతో ఇబ్బందులు పడే వారు.అది చూసి ఆ ఊరి అతను " మీ ఊరు ప్రజలు మంచినీటి కోసం చాలా దూరం వెళుతున్నారు.నీ బావి నీళ్ళు ఇస్తే నీదేమి పోతుంది " అంటే  "చాల్లే భలే చెప్పొచ్చావు ఉన్న ఆ కాసిన్ని నీళ్ళు అయిపోతే నేను కూడా
ఇబ్బందులు పడవలసి వస్తుంది " అనే వాడు.
నిజానికి భూషయ్య బావిలో ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి.ఎవరికీ నీళ్ళు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు. ఆ ఊరిలోనే  రాజయ్య అనే చిన్న మోతుబరి రైతు భూషయ్య పిసినారి తనం,ప్రజలు నీటికోసం పడుతున్న కష్టాలు చూసి చలించిపోయాడు. తన సొంత ఖర్చుతోనే ఓ మంచినీటి బావి ఏర్పాటు చేశాడు.నీళ్ళు పుష్కలంగా పడ్డాయి.ఊరు ప్రజలు అందరిని సమావేశ పరచి  " మీరు మంచినీటికి ఇక ఎక్కడికి పోనవసరం లేదు.మన బావిలో నీరు పుష్కలంగా ఉంది. అందరూ వాడుకోవచ్చు " అన్నాడు. దానికి ప్రజలు అందరూ రాజయ్య ను అభినందించారు. " ఎంత డబ్బు ఉంటే ఏం చేసుకుంటాం,మంచితనం లేకపోతే" అని భూషయ్య నుద్దేశించి అన్నారు.
" అవును మన వెంట డబ్బు రాదు,మనం చేసే మంచి పనులు మనవెంట ఎప్పుడూ ఉంటాయి.నిజమైన ధనవంతుడు రాజయ్య "
అన్నాడు ఓ వృద్ధుడు. రాజయ్య బావి ఊరి ప్రజల దాహార్తిని తీరుస్తోంది

కామెంట్‌లు