పంట;-...కనుమ ఎల్లారెడ్డి-93915 23027

 సదా నందం మోతు బరి రైతు. తన రెండెకరాల పొలంలో జొన్న వేశాడు.పంట బాగా పండింది. సదానందం తన కుమారుడు పదేళ్ల గోవిందుడుని పిలిచి "మన చేలో జొన్న కంకులు ఎలా ఉన్నాయో చూచి రా " అని ఆజ్ఞాపించాడు.గోవిందు తలూపి జొన్న చేనుకు వెళ్ళాడు.చేలో కొన్ని నిటారుగా ఉన్నాయి.మరికొన్ని తలవాల్చి ఉన్నాయి.వాటిని చూసి సందేహంలో పడ్డాడు గోవిందు.వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. " కొన్ని ఎందుకు నిటారుగా ఉన్నాయి,కొన్ని తలవాల్చి ఉన్నాయి " సందేహంగా అడిగాడు.
"వాటిని చూడగానే నీకు ఏమనిపించింది " అడిగాడు.
" నిటారుగా పెరిగినవి మంచివి,తలవాల్చినవి
పనికిరానివి " అని చెప్పాడు.
దానికి సదానందం నవ్వి " చూడు గోవిందు నిటారుగా ఉండేవి మంచివి అన్నావు అది తప్పు,తలవాల్చినవి శ్రేష్ఠమైనవి.అవి కంకుల
బరువుతో వాలి ఉన్నాయి.పంటను ఇచ్చేవి అవే.నిటారుగా ఉండేవి తుచ్చమైనవి " అన్నాడు.
తన సందేహం తీరి నందుకు " ఓహో అలాగా " అన్నాడు గోవిందు.

కామెంట్‌లు