;సూక్తులు.సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com
 
జీవితం-
@ కష్టతర మానవ జన్మ ఎత్తి ఈ జన్మలోనే  భగవంతుని పొందటానికి కృషిచేయని జీవితం వృధా.
 @కాలు తడవకుండా సముద్రం దాటొచ్చుగానీ కన్ను తడవకుండా జీవితం దాటలేం.
@కోర్కెలు అదుపుచేసుకున్నవాడు నియమబద్ధ జీవితం గడపగలడు.
ఖగోళమానంలో కొలిస్తే, మానవజాతి జీవితం మూన్నాళ్ళ ముచ్చటే.
@ఖుషీ జీవితం భూమిమీద నీడ లాంటిది. జనాథన్ ఎడ్వర్డ్స్
@గజాలలో కొలిస్తే జీవితం శ్రమతో కూడి ఉంటుంది, అంగుళాల్లో కొలిస్తే అది మిక్కిలి సరళంగా ఉంటుంది. జియాన్ గొర్డాన్
@చావు గురించి భయపడేవాళ్లు సహజంగానే జీవితం గురించి భయపడుతుంటారు. జాన్ విట్టియర్
@చిత్రాతిచిత్రమైంది జీవితం,పెద్ద ఫలితాలను స్వాగతిస్తూ, సాదాసీదా వాటిని తిరస్కరిస్తే, అద్భుత ఫలితాలు ఇట్టే అందుతాయి. సూక్తులు. 

కామెంట్‌లు