సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 విజయం-
@ మనస్పూర్తిగా పనిచెయ్యకుండా లభించే విజయం తన చుట్టూ వెగటుతనాన్ని మాత్రమే వెదజల్లుతుంది.
@ మనస్పూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయం సాధించలేరు. అబ్దుల్ కలాం
@ మహ్మదీయ విజయం భారతదేశంలో అణగదొక్కబడిన వారికీ, బీదవారికీ మోక్ష ప్రదాయినిగా పరిగణించబడింది.  అందుకే దేశ జనాభాలో 5వ వంతు మహ్మదీయులైనారు. 
@ మొదటి అడుగు ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది.   పట్టువిడవకుండా ముందుకు సాగినప్పుడే విజయం చెంతకు చేరుతుంది . అబ్దుల్ కలాం
@ లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. వివేకానంద
@ విజయం  కష్టజీవనానికి పట్టుదలకు కలిగిన బిడ్డ. 

కామెంట్‌లు