పరమ సత్యాలు;-సేకరణ.మీ గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.
 1. చూపించిన వినయం
    లోపించే దాకా తెలియదు!
2. అనురాగం అమృతం కాకపోతే 
   అడ్డాల బిడ్డలు జీవచ్చావాలే కదా
3. సరస్వతి కృప లేనిదే!
    సర్వసంపదలుండియూ నిరర్థకం!
4. నిర్మలమైన మనస్సు
    దర్పణం లాంటిది.!
5. చేస్తూ పోతే...
   ఎంత పెద్ద పనైనా  మిగలదు.
    వ్రాస్తూ పోతే....
మహా గ్రంథమైన ముగియక పోదు.
6. దీనివలన మన మనసుకు బాధ కలుగుతుందో దానిని చేయకపోవడమే విజ్ఞత.
7. ఆధ్యాత్మికత పేరుతో ప్రపంచాన్ని గమనించకపోతే ప్రమాదమే
గమనించిన ప్రపంచమే సర్వ మనుకుంటే ఆధ్యాత్మికత
 అవసరమే ఉండదు.
8. ఎవరిమీద మీద ద్వేషమూ
   ధనవంతుని చేయదు.
  కోపం ఉంటే.
గుణవంతుడు కూడా చెడి పోతాడు.
మంచితనము...
మనిషిని దేవుడి గా మారుస్తుంది.

కామెంట్‌లు