బాల గేయం; -లతా శ్రీపుంగనూరు9666779103
పిల్లల్లార రారండి
ప్రాణుల నుండి నేర్వండి


లేవడం లో కోడిని అనుసరిద్దామండి
వినటంలో పిల్లి మేటైనదండి
విశ్వాసంలో కుక్కకు సాటి లేరండి
పరులసేవలో ఆవు కు హద్దు లేదండి

క్రమశిక్షణ లో చీమను అనుసరిద్దామండి
నాట్యంలో నెమలి మేటైనదండి
విజ్ఞానం లో హంసకు పోటి లేరండి
పరుషంలో పొట్టేలుకు హద్దు లేదండి

గానంలో కోకిల ను అనుసరిద్దామండి
సాహసంల పులి మేటైనదండి
పరాక్రమం లో సింహానికి సాటి లేరండి
పరుగులో గుర్రానికి హద్దు లేదండి


కామెంట్‌లు