"మాజీప్రధాని భారతరత్నఅటల్ బిహారివాజ్ పేయిగారి 97 వ జయంతి-పద్యాంజలి!!!";-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటఛరవాణి:- 6300474467
 01.
కం.
మిన్నగదేశమునందు,స
మున్నతధర్మంబునెఱపిముచ్చటగొల్పన్
వన్నెగప్రధానిపదవిని
యున్నతముగవాజుపేయియుర్వినినొందెన్!!!

02.
కం.
హిందూముస్లిముక్రైస్తవు
లందరుసోదరులభంగిననురాగసుధల్
చిందించాలనిజెప్పెను
సుందరముగవాజుపేయిసుజనులకెపుడున్!!!

03.
కం.
భారతరత్నమెయాతడు
భారతదేశాన్నియేలిప్రగతినికోరెన్
భారతమాతఋణమునే
ధీరతతోదీర్చినట్టిధిషణుడువాజ్పేయ్!!!

04.
కం.
హిందీపండితుడాతడు
పొందికతోకవితలెన్నొభువిపైవ్రాసెన్
గంధాలనుచిందించియు
నందాలనుగూర్చినాడునటలుబిహారీ!!!

05.
కం.
జనరంజకముగపాలన
జనులకునచ్చినవిధముగచక్కగజేసెన్
వెనుకంజసలేవేయక
మునుముందుకువెళ్ళినాడుమురిపెముతోడన్!!!

06.
కం.
"ఐరాస"సభలయందున
నోరూరగహిందిలోననుత్సాహముతో
జోరుగమాట్లాడియతడు
పేరులుపొందెనుబిహారివిద్వాంసుండై!!!

07.
తే.గీ.
ఉగ్రవాదమునరికట్టనుద్యమించి
విశ్వశాంతికినీవొకవేదికగుచు
నిల్చినావయ్యసంస్కారనిధులొసంగి
సమతమమతలపుష్పాలుచల్లినావు!!!

08.
తే.గీ.
సర్వమానవక్షేమసంస్కారమరయ
పాటుబడితానుసమతాప్రవర్ధమాన
సుస్థిరపరిపాలనమునేసుందరముగ
అటలుబీహారివాజ్పేయిఅందజేసె!!!

09.
తే.గీ.
వేదభూమిగవర్ధిల్లిప్రేమపంచు
పురిటిగడ్డగభాసిల్లుపుణ్యభూమి
యిదియెననియంచువాజ్పేయియెరుకపరిచి
శాంత్యహింసలబోధించెజగతికిద్ది!!!

కామెంట్‌లు