సిరివెన్నెల సీతారామశాస్ట్రీ సాహిత్యం భరద్వాజరావినూతల 9866203795

 సాహితీబృందావనవేదిక 💚
వరుస సంఖ్య-64ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
**********
3️⃣1️⃣6️⃣)
నిగ్గదీస డుగు సమాజ జీవచ్ఛవాన్ని 
నిలదీసడుగు సమాజ దురాగతాన్ని 
అంటూ కలంతో   పలికాడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
3️⃣1️⃣7️⃣)
ఇంటిపేరు చేసుకున్నాడు సిరివెన్నెల 
పాటలతో వేసాడు అక్షరఊయల 
సాహిత్యం ఆయనచిరునామా 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
3️⃣1️⃣8️⃣)_
ఆది భిక్షువును నిలదీసాడు 
సాహిత్యాన్ని ఉఛ్వాసం చేసాడు 
సంగీతాన్ని నిశ్వాసంగామలిచాడు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
**********
3️⃣1️⃣9️⃣)
తెలుగు పాటలాకాశాన  ధృవతార 
అందర్నీఆలరించాడు ప్రియమార 
కళామతల్లికి అయినాడు ముద్దుబిడ్డ 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
***********
3️⃣2️⃣0️⃣)
కలంతో  మోగించాడు  శృతిలయలు 
అందుకున్నాడు ఎన్నో పురస్కారాలు 
చేసాడు పాటల యజ్ఞం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
********** 
కామెంట్‌లు