ఓం శివాయ గురవే నమః! ఆత్మ భవుఁడు .. శివుడు"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098ఓం శివాయ గురవే నమః! ఆత్మ భవుఁడు .. శివుడు"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 🙏ఆత్మ భవుఁడవు నీవె!
     ఆద్యంత రహితుడవె!
   
     అక్షర పరం బ్రహ్మ!
               ఓ సాంబ దేవ!
   ( సాంబ శివ పదాలు.,"శంకర ప్రియ.,"
 🔱సాంబ సదా శివుడు...  సచ్చిదానంద స్వరూపుడు, అద్వితీయుడు, అక్షరుడు, ఆద్యంత రహితుడు, ఆత్మ భవుఁడు! సర్వోత్కృష్ట మైనవాడు.. సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి!
🔱పరమేశ్వరుడు.. పంచ మూర్త్యాత్మకుడు!  పంచ కృత్య పరాయణుడు! అనగా, బ్రహ్మ.. విష్ణువు..  రుద్రుడు.. మహేశ్వరుడు.. సదా శివుడు, అనెడు అయిదు మూర్తులుగ విరాజిల్లు చున్నాడు!  సృష్టి.. స్థితి.. సంహారము.. తిరోధానము.. అనుగ్రహము.. అనెడు, అయిదు కృత్యములను నిర్వహించు చున్నాడు, శ్రీ శివ పరమాత్మ!
🔱మహా భారతాంతర్గత మైన.. శ్రీ శివ సహస్రనామ స్తోత్రము నందు.. "అక్షరం పరమం బ్రహ్మ" అని, ( 412 మరియ 413.వ నామము లందు );
"సాంబ శివ పరం బ్రహ్మ తత్వము"ను విశదీకరించారు, శ్రీకృష్ణ పరమాత్మ. 
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( ఉత్పల పద్యము )
       ఎవ్వనిచే జనిoచు, జగమెవ్వని లోపల నుండు, లీలమై
         యెవ్వని యందు డిందు, పరమేశ్వరు డెవ్వడు, మూల కారణం
       బెవ్వ, డనాది మధ్య లయు డెవ్వడు, సర్వము తాను యైన వా
       డెవ్వడు, వాని నాత్మ భవు, నీశ్వరు నే శరణంబు వేడెదన్!
       ( భక్త కవి పోతన, గజేంద్ర మోక్షం., ఆంధ్ర మహా భాగవతం)
   🙏ఓం నమః శివాయ! శివాయ నమః!

కామెంట్‌లు