గీతా వాణి: ప రి ప్ర శ్న ! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
  👌జ్ఞాన వంతుల జేరి
   
       పరిప్రశ్న వేయండి!
       జ్ఞానమును పొందండి!
           ఓ తెలుగు బాల!!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌దేహము.. పాంచ భౌతిక మైనది. నశ్వర మైనది.. దేహము!  అట్లే, ప్రపంచము.. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము లనెడు; పంచమహా భూతములతో విలసిల్లుచున్నది. పరిణామశీల మైనది.. ప్రపంచము! 
👌భక్తులు, జ్ఞానులు..  ఈ దేహమును, ప్రపంచమును పరిశీలించునప్పుడు; పలు సందేహములు కలుగు చున్నాయి. ఆయా ధర్మ సందేహ నివృత్తి కొఱకు, అనుభజ్ఞులైన పెద్దలను ఆశ్రయించాలి. వినయ విధేయతలతో, వారికి సేవలు చేస్తూ; పరిప్రశ్నలను వేయాలి. పిమ్మట, సందేహములకు.. సమాధానములను తెలుసుకోవాలి.
🚩మనమంతా జ్ఞానవంతులు, విజ్ఞానవేత్త లైన, వారి అడుగుజాడలలో నడవాలి. తత్త్వ జ్ఞానోపదేశమును పొందాలి! సాధనా రహస్యములను.. త్రికరణ శుద్ధిగా ఆచరించాలి.
👌ఓ అర్జునా! నీవు.. జ్ఞాన విజ్ఞాన వంతులకు నమస్కరించడం వలన; వారికి ప్రేమపూర్వకంగా సేవలు చేయడం వలన; వారిని భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించడం వలన; ... తత్త్వ జ్ఞానమును తెలుసు కొనుము. ఆవిధంగా సాధకులు.. వారికి పరిచర్యలు చేయడం వలన, తత్త్వ వేత్తలైన జ్ఞానవంతులు సంప్రీతులై; తత్త్వ జ్ఞానమును ఉపదేశిస్తారు! అని, గీతాచార్యుడు వివరించు చున్నారు.
🚩 "తద్విద్ధి ప్రణిపాతేన, పరి ప్రశ్నేన, సేవయా!" అని, గీతా సందేశము! ఇది.. (4) జ్ఞాన విజ్ఞాన యోగము, 34వ. శ్లోక రత్నము!
  🙏గీతా సందేశము
       ( తేట గీతి)
      నీవు తత్త్వ వేత్తల నాశ్రయించి
       అడుగులకు మ్రొక్కి, శుశ్రూష లాచరించి;
        కరుణ నార్జించి, ఎరుకను బడయు మయ్య!
          విడువక సమస్త శంకల నడిగి యడిగి!!
      ( గీతాదర్శము., 'తెనుగు లెంక' తుమ్మపల్లి సీతారామ మూర్తి., )  

కామెంట్‌లు