గీతా వాణి: గీ తా మృ త ము ! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
  👌దివ్య "గీతామృతము"
   
       సకల "వేద సారము"!
       కలిగించు "శివ పదము"!
                ఓ తెలుగు బాల!!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌"అమృత" శబ్దమునకు.. పీయూషము ( పానము చేయ బడునది ), సుధ ( సుఖముగా త్రాగ బడునది).. అను పేరులు కలవు. దీనిచే మృతులు గారు. కనుక, "అమృతము" అని పేరు.
         "అమృతము, జలము, క్షీరము, మోక్షము, యజ్ఞశేషము, అయాచితము..అనునవి".. అమృత శబ్దమునకు నానార్ధములు. "శివ పదము" అనగా.. శ్రీ కైవల్యము, శుభ ప్రదము, క్షేమంకరము!
👌భగవద్గీత.. మహా భారతాంతర్గత మైనది. దీనిని "అమృతము"గా అభివర్ణించారు, మన మహర్షులు.
       ఉపనిషత్తులను.. గోవులుగా; అర్జునుని.. ఆవు దూడగా; వాసుదేవుని.. గోపాల బాలునిగా;  భక్త మహాశయు లందరు.. భోక్తలుగా పేర్కొన్నారు.
     "గీతామృతము యొక్క తియ్యదనము, మరియు కమ్మదనము..  చెప్పనలవి కానిది. అందులో.. గొప్పరుచి దాగియున్నది. దీనిని ఎంత ఆస్వాదించినా, ఎంత వివరించినా తనివి తీరదు" అని; వివరించు చున్నారు, అనుభవజ్ఞు లైన సాధకోత్తములు.
🚩సమస్తమైన ఉపనిషత్తులు.. ఆవులు. పార్ధుడైన అర్జునుడు.. ఆవు దూడ. పార్ధ సారధి యైన కృష్ణ పరమాత్మ.. క్షీరము పితుకువాడు. మహత్తర మైన గీతామృతమే.. ఆవుపాలు. సద్బుద్ధి కలవారు.. గీతా క్షీరమును పానము చేయువారు; అని, గీతా మాహాత్మ్యము విశదీకరించు చున్నది.
🚩 సర్వోపనిషదో గావో
      దోగ్ధా గోపాల నందనః!
       పార్దో వత్స:, సుధీ ర్భోక్తా
        దుగ్ధం గీతామృతం మహత్!!
            ( ఇది గీతా మాహాత్మ్యం, ధ్యాన శ్లోకం.,)
  🙏గీతా సందేశము
       ( తేట గీతి)
      గోగణం బెల్ల, ఉపనిషత్ కోటి గాఁగ,
       వత్స పార్థుoడు గా, దోగ్ధ వాసుదేవు
        డమర, గీతామృతమ్ము క్షీరముగ మారె!
          బుద్ధిమంతుడు తత్ క్షీర భోక్త యగును!!
      ( గీతాసప్తతి., 'అష్టావధాని' శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి., )       

కామెంట్‌లు