గీతా వాణి: గీ తా చా ర్యు డు ! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
  👌పార్ధ సారధి యైన
       కృష్ణుడు జగద్గురువు!
        అల గీతాచార్యుడు!
                ఓ తెలుగు బాల!!
           ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ., )
👌 "భగవద్గీత" అనగా.. సాక్షాత్తు భగవానుడైన పరమేశ్వరుని వాణి! సకల మానవాళికి.. గీతను ప్రబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ! కనుక, "గీతాచార్యు" డైనాడు.
      "కృష్ణు" డనగా.. సమస్తమును కలిగించు వాడు. కృష్ణ వర్ణము.. చిత్తమును ఆకర్షించునది. ఆ నలుపు వన్నె కలవాడు. కనుక, "కృష్ణు"డని పేరు.
👌అర్జునునకు.. పార్థుడని, మరొక పేరు. కురుక్షేత్ర మహా సంగ్రామములో, మహారధికు డైన పార్ధునకు.. రథ సారధి యైనాడు, వాసు దేవుడగు కృష్ణుడు!
       పార్ధ సారథి యగు కృష్ణుడు.. అర్జునుని, కర్తవ్య పరాయణుని కావించాడు. కర్మ, భక్తి,  జ్ఞాన, యోగ మార్గముల రహస్యములను విశదీకరించాడు.
👌 గీతాసందేశము.. సకల మానవాళికి, పరమార్థ కాముకులైన భారతీయులకు.. మిక్కిలి ప్రయోజన కరముగా నున్నది. అందువలన, "జగద్గురువు"గా విఖ్యాతి నొందాడు గీతాచార్యుడు!
🚩 సారధ్య మర్జున స్యాదౌ,
      కుర్వన్ గీతామృతం దదౌ!
      లోక త్రయోపకారాయ
      తస్మై కృష్ణాత్మనే నమః!!
            ( ఇది గీతాచార్య ధ్యాన శ్లోకం.,)
  🙏గీతా సందేశము
       ( తేట గీతి)
      అల కిరీటికి సారధి నగుదు ననుచు,
       ముందుగా పల్కి, ముల్లోకముల కుపకృతి
         సలుప,

"గీతామృతంబు" వెదజల్లి నావు!
          కృష్ణ! కైకొమ్ము మా నమస్కృతి శతమ్ము!!
      ( గీతా సప్తతి., 'అష్టావధాని' శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ శాస్త్రి., )      
కామెంట్‌లు