శివాయ గురవే నమః! నృత్య ప్రియుడు .. శివుడు "శంకర ప్రియ.," శీల., సంచార వాణి: 99127 67098
 🙏నట శేఖరుడ వీవె!
     నృత్య ప్రియుడ
 వీవె!
   
      నటరాజ! రవితేజ!
               ఓ సాంబ దేవ!
   ( సాంబ శివ పదాలు.,"శంకర ప్రియ.,"
 🔱పరమేశ్వరుడు.. నటరాజు! నిరంతరము ఆనంద తాండవ నృత్యము సలుపు వాడు! నృత్య ము.. అంగ విక్షేప మాత్రమే కలది. అట్లే, నటుని యొక్క హావ భావ విన్యాసమే నాట్యము!  దీనికి.. నర్తించుట, నటించుట, క్రీడించుట.. అని, విశేషార్ధములు.
🔱  సాంబ  శివ పరమాత్మ ఒక్కడే! బహువిధములైన  జీవరాశుల రూపములుగా గోచరించు వాడు. నటరాజ స్వామి.. తాండవ ప్రియుడు.
🔱మహా భారతాంతర్గత మైన.. శ్రీ శివ సహస్రనామ స్తోత్రము నందు.. "బహు భూతో బహు ధర:" ( 165.వ నామము) నందు; మరియు "నృత్య ప్రియో,  నిత్య నర్త:" అని; ( 170.. 171 నామము లందు);  శ్రీ శివ పరంబ్రహ్మ తత్వమును అభి వర్ణించారు, శ్రీకృష్ణ పరమాత్మ. 
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( కంద పద్యము )
       నర్తకుని భంగి పెక్కగు
        మూర్తులలో నెవ్వడాడు; మునులు దివిజులున్
       కీర్తింప నేర రెవ్వని
       వర్తన మొరు లెరుగ, రట్టి వాని నుతిoతున్!
       ( భక్త కవి పోతన, గజేంద్ర మోక్షం., ఆంధ్ర మహా భాగవతం)
   🙏ఓం నమః శివాయ! శివాయ నమః!


కామెంట్‌లు