సప్త దినాధిపతులు: సూర్యుడు! "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌'భాను'డనగ సూర్యుడు!
     అర్కుడు దివాకరుడు !
    విజయము నొసగు మీకు!
           ఓ తెలుగు బాల!
🚩సూర్యుడు.. సప్త దినాధిపతు లలో మొదటివాడు! కాశ్యప గోత్రజుడు. సింహ రాశికి అధిపతి.  సూర్యోదయమునకు  "సూర్య హోర"తో ప్రారంభమగు రోజు.. "ఆది వారము". దీనికే "భాను వాసరము" అని, సంస్కృత నామము!
🙏ధ్యాన శ్లోకము:
జపాకుసుమ సంకాశం,
కాశ్యపేయం మహాద్యుతిమ్!
 తమోరిం సర్వ పాపఘ్నం,
ప్రణతోస్మి దివాకరం!!
👌"సూర్యుడు"(దైనందిన వ్యవహారము లందు జీవులను  ప్రేరేపించు వాడు), "అర్కుడు"(పూజింప బడువాడు), "ఆదిత్యుడు"(అదితి కుమారుడు), "భానుడు" (ప్రకాశించు వాడు), "దివా కరుడు"(పగలు కలిగించు వాడు), "తమోహరుడు"(చీకటిని పోగొట్టు వాడు), మున్నగునవి..  సూర్యునకు పేరులు.
  🙏ప్రార్ధనా పద్యము
       (ఉత్పల మాల)
      శ్రీకర భాను దేవుడు, విశిష్ట నవగ్రహ ముఖ్యు, డుత్తమ 
      శ్లోకుడు, విష్ణు రూపి, సరసుండు మనోజ్ఞుడు, కర్మ సాక్షియున్,
       లోకతమో వినాశకు, డలోలు, డనామయతా ప్రదాత, ది
        వ్యాకృతి, దివ్య విగ్రహు, డహర్పతి  మాకు శుభంబు లిచ్చుతన్!!
( 'ఆర్షకవి శిరోమణి' విద్వాన్ బులుసు వేంకటేశ్వరులు., సప్త దినాధిప స్తవము. )

కామెంట్‌లు