అనాసతో కోడి;- డా:కందేపి రాణి ప్రసాద్

 పిల్లలు!కోడితో కూరలు వండటం అందరికి తెలుసు!కానీ కూరగాయలతో కోడి తయారు చేయటం తెలుసా!ఈరోజు అనాసకాయ,దోసకాయలతో కోడిని తయారు చేయటం నేర్చుకొందమా!అసలు కోడి గురించి మికేమి తెలుసు.ఇది 'లివింగ్ అలారం;
ఎందుకంటే తెల్లవారుజామునే నాల్గుగాంటలకు'కొక్కోరకో ' అంటూ ఊరి జనాన్నంత
నిద్రలేపుతుంది.నగర సంస్కృతికి అలవాటు పడిన వారెవరికి ఇవి తెలియవు కదూ!సరే మనం ముందు కోడి తయారు చేయటం నేర్చుకుందామా!
అనాసకాయకు పై భాగాన గుబురుగా ఆకులు ఉంటాయని తెలుసు కదా!కాయకు ఆకులు కొంచెం వంపుగా అమరి ఉంటే బావుంటుంది. అటువంటి కాయను ఏరి తెచ్చుకోవాలి ఇది కోడి  శరీరమూ,ఈకలు,తోక అన్నమాట.ఒక ఆకుపచ్చని కీరా దోసకాయను తీసుకొని ఎటావాలుగా ఒక చివర కత్తిరించి,అవైపును అనాసకాయకు పెట్టి టూత్ ఫిక్స్ తో కదలకుండా గుచ్చాలి.అంటే ఇది తల అన్నమాట .మీకు ఫొటోలో సులభంగా అర్థమవుతుంది.ఒక పండు మిరపకాయను తీసుకొని మధ్యకు కత్తిరించి ముక్కులా అమార్చాలి.కన్ను కోసం క్యారెట్ ముక్కను గుండ్రంగా కత్తిరించి దానిని కన్ను భాగంలో  అగ్గిపుల్ల సాయంతో గుచ్చాలి.అగ్గిపుల్ల తల పైవైపునకు ఉండాలి.అప్పుడే అది కన్నులా కనిపిస్తుంది.ఇంతవరకు ఇలా తయారుచేసుకుంటే కోడిపెట్ట అవుతుంది.మీకు పుంజు కావాలంటే దాని నెత్తిమీదా ఎర్రటి తురాయిని,ముక్కు కింద రెండుగా విడి వడి ఉన్న ఒక తిత్తి లాంటి నిర్మాణాన్ని పెట్టాలి.దీనికోసం క్యారెట్ ఉపయోగిస్తే బావుంటుంది.చూశారా పిల్లలు ! అనాసకాయతో  కోడి తయారయింది.కానీ ఈ కోడి నిలబడలేదు అందుకని అనాసకాయ అడుగుభాగం కొంచెం చదునుగా కొస్తే అప్పుడు అది నిలబడుతుంది.
బావుంది కదూ ! ఈసారి మీ ఇంటికి డిన్నారుకు అతిదిలొస్తే ప్రసంశలు కొట్టేయండి!బై
కామెంట్‌లు