పిట్టల పోరు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనిషి లో ఐకమత్యంలేదు.ఆవులు గొర్రెలు చీమలలోఐకమత్యం అవి నడిచే తీరులోనే తెలిసిపోతుంది. ఒకేబాటలో గుంపులుగా ఓ పద్ధతిలో నడుస్తాయి.అడవికంతా సింహంరాజు. అలాగే పిట్టలు పక్షులు కూడా తమకు ఒక రాజు ఉంటే బాగుంటుంది అనుకున్నాయి.అన్నీ ఎగరేవి.కానీ వాటినన్నిటినీ ఒకే తాటిపై తేలాలంటే  రాజు ఓనాయకుడు కావాలి. కాకి ప్రచారం చేస్తానని కావ్ కావ్ అంటూ తన గొంతునే  మైక్ గా మార్చి అరుస్తూ డప్పు కొట్టసాగింది."ఓహో!చిట్టిపొట్టి పిట్టలు పక్షులూ! మనలో ఎన్నో రకాల సైజుల్లో రంగుల్లో పక్షులు న్నాయి.నేలపై నడిచే వాటితో మనకు సంబంధం లేదు. అవి పెంపుడు పక్షులు! అవి మనిషికి ఆహారం గా దేవుని కి బలిగా ఇవ్వబడుతున్నాయి.కానీ అడవిలో ఉండే మనకుకష్టాలు   ఎక్కువ. అవి కలబోసుకోవాలి.పరిష్కారం ఆలోచించాలి.మన రాజు ని ఎన్నుకోటానికి ఆపెద్ద మర్రిచెట్టు దగ్గరకు రండి."ఇంకేముంది? గూళ్ళని వదిలి బుల్లిపిట్టలు కొమ్ములు రెమ్మల పై వాలితే నెమలి కొంచెం పెద్ద సైజువి రాతి బండలపై ఆశీనులైనాయి.డేగ గద్ద రాబందు నేలపై వాలాయి.మరి రాజుని ఎలా ఏ ప్రాతిపదికపై ఏ అర్హత చూసి  ఎన్నుకోవాలి? అంతా మల్లగుల్లాలు పడుతున్నాయి.ఆఖరికి ఓ తీర్మానం చేశాయి.ఏపక్షిఐతే బాగా వేగంగా ఎగురుతుందో ఎత్తు గా ఆకాశంలో చుక్క గా మారుతుందో అదేమనకు రాజు. ఓ పావుగంటలో ఎవరికీ కనపడనంత ఎత్తులో ఎగిరి అక్కడినించే పొలికేక పెట్టాలి.అదే వాటి తీర్మానం. డేగ గద్ద రాబందు  తమదే గెలుపు అనే ధీమాలో ఉన్నాయి.అన్నీ పొలోమంటూ ఎగరసాగాయి.మబ్బులు అడ్డురావటంతో చాలా పక్షులు "మావల్లకాదు బాబోయ్"అని పందెం నించి తప్పుకున్నాయి.ఇంతలో బాగా పెద్ద సైజు లో ఉన్న గరుడ పక్షి నుంచి పొలికేక వినపడింది"నేనే రాజు ని"అంటూ.
గరుడుడు ఆధ్వనికి ఆశ్చర్యపోయి నేలకి వాలింది.దాని రెక్కలలో దర్జాగా కూచున్న బుల్లిపిట్ట పొలికేక అది. "నీవు టక్కుటమారం మోసగత్తెవి. నీవు ఎలా రాజువి అవుతావు? పైగా గరుడుని రెక్కల పై కూచున్నావు.నీస్వయంశక్తితో ఎగరలేదుగా? పైగా నీవు జానాబెత్తెడుకూడా లేవు." ఈసారి కొత్త పందెం పెట్టుకున్నాయి.భూమి లోపలికి బాగా తొలుచుకుంటూ పోయే పక్షి యే రాజు అవుతుంది. కొన్ని పక్షులు ముక్కు కాళ్ళ తో భూమిని తొలిచి నిర్దేశించిన టైం లో వెళ్లగలిగాయి ఓ అర అడుగు వరకు. ఒక బుల్లిపిట్ట  ఎలుక కలుగులో దూరి ఎవరికీ కనపడకుండా పోయింది. కానీ లోపలినించి"నేనే రాజు ని "అని అరవసాగింది.చివరికి పిట్టలన్నీ ఇలా నిర్ధారించాయి."మన కి సరైన పందెం పోటీ నిర్వహించటమే చాతకాలేదు.ఎవరిస్వేచ్ఛ వారి దే!ఎవరి ప్రాణరక్షణవారిదే"అని.
కామెంట్‌లు