చిన్నారి గ్రంధి సరస్వతికి ఘన సన్మానం

 గుర్రంకొండ పట్టణంలో సోమవారం  శ్రీ పడిదం రవీంద్రనాథ్ ఇంటి   ఆవరణలో మనోజ్, నాగరజిత ల మానస పుత్రిక గ్రంధి సరస్వతి మైసూర్ దత్త పీఠం వారు ప్రతి ఏటా నిర్వహించే సంపూర్ణ భగవద్గీత పోటీలలో అత్యంత ప్రతిభను కనబరిచి శ్రీ గణపతి సచ్చిదానంద స్వాముల వారి చేతుల మీదుగా స్వర్ణ పతకాన్ని అందుకున్న సందర్భంగా.. రాష్ట్ర మహేశ్వర జంగం సేవా సంఘం వారి ఆధ్వర్యంలో చిన్నారి సరస్వతిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మద్దిరాళ్ళ మల్లికార్జున మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే అనర్గళంగా సంపూర్ణ భగవద్గీత శ్లోకాలను పఠించి, వినిపించి పలువురి మనసులను మెప్పించిన చిన్నారి సరస్వతి తన ఉజ్వల భవిష్యత్తులో మరెన్నో పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. తదనంతరం రచయిత జరుగుమల్లి వీరయ్య మాట్లాడుతూ.. స్వర్ణ పతకం అందుకున్న చిన్నారి సరస్వతి జ్ఞాన సరస్వతిగా మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి వాసు నూరి. కిషోర్ కుమార్, కోశాధికారి తణుకు మణికంఠ, కార్యవర్గ సభ్యులు టి రమణయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాయిని అమరేంద్రకుమార్, తిరువీధి.వేణుస్వామి, తదితరులు పాల్గొని చిన్నారి సరస్వతిని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కామెంట్‌లు