డా.వాసరవేణి పర్శరాములుకు సాహితీ విభూషణ అవార్డు

 లంబోధర  కల్చరల్ అకాడమీ 6వ జాతీయస్థాయి బాలల కళోత్సవాల్లో భాగంగా బాలసాహిత్యంలో రచనచేయడంతోపాటు పరిశోధన చేసి నిరంతరం చేస్తున్న సాహిత్య,సామాజిక సేవలను గుర్తించి డాక్టర్ వాసరవేణి పర్శరాములుకు సాహితీ విభూషణ అవార్డును సిరిసిల్ల గ్రంథాలయంలో  జరిగిన కార్యక్రమంలో  లంబోధర అకాడమీ చైర్మన్ కళా అశోక్ గారు అందించారు. అతిథులు గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఎం.డి సలీమ్, రాజన్న, నటుడు డైరెక్టర్ కొక్కుల భాస్కర్,రచయిత్రి కందేపి రాణిప్రసాద్,ప్రకృతి ప్రకాశ్, కిరణ్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు