మానవవనరులు;-మాడుగులమురళీధరశర్మ* కాళేశ్వరం/సిద్ధిపేట*
 కం-1
మానవవనరులుమనములు
నానీతమువెలికితీయ*
నభివృధ్ధిగనున్!
కాననియంతరజ్ఞానము
మానవమేధోమదనము*
మహిమాన్వితమౌ!
కం-2
ముఖముఖమునగలవాణీ
నఖశిఖపర్యంతమాత్మ*
నాణ్యతపెంచున్!
సుఖదుఃఖములకు మూలము
ముఖరీకృతమూర్తిమత్వ*
ముఖ్యపువనరుల్!
కం-3
మానవవనరులనేకము
తానుగసానమునుపట్ట*
దౌడునుతీయున్!
మానస,శ్రామికశక్తులు
ఫేనములైవెలుగునొంది*
ప్రేమలపంచున్!
కం-4
భౌతిక శ్రామికులెప్పుడు
రౌతుగపరుగెత్తుగాని*
లౌక్యమెరుగునా!
జ్ఞానులుమానసశ్రమతో
మేనునునురికించుచుండు*
మేటిగమేదిన్!
కం-5
రెండునుకలగలిపినచో
అండగనిలుచుండుజీవ*
నాధారముగా!
దండిగమానవతావిని
ఖండాంతర ఖ్యాతి పెంచు*
కమనీయముగా!
కం-6
జీవనయానమునందున
పావనమౌమానవత్వ*
పరిమళశోభల్!
కావలెస్త్రీపురుషులకును
భావింపగమానవులకు*
మానవవనరుల్!
కం-7
మా నవ వనరులు ధనమని
ఈనవలోకమ్మునెంచు*
నీకలిలోనన్!
మానవ కనుమిదశాశ్వత
మౌనిల మనుగడకు చేటు*
మరువకు సుమ్మీ!
కం-8
మదిలోనింపుముజాగృతి
సదమలమౌనిత్యకర్మ*
సారఫలముగా!
పదపడి మెదడును వాడుము
నదియేమనవనరునెపుడు*
నాలోచింపన్!

కామెంట్‌లు