బ్రతుకుబాట.... నూతన పరిచ యాలూ... విస్తరిస్తున్నసాహిత్య రంగం !కోరాడ నరసింహా రావు!

  ***  38  ****
నేను... మాచిన్నగురువు... మిగతాస్నేహితులతో కలసి రోజూ...షాపులు కట్టేసిన తరువాత... అలా షికారు వెళుతూ... సోడా కి ఫేమస్ ఐన సూర్యనారాయణ షాప్ లో సోడా లు త్రాగటం... మార్గమధ్యంలో ఉన్న వేది గారి పుస్తకాల షాపు దగ్గర కాసేపు మాట్లాడటం అలవాటు !
ఈ వేది గారి పుస్తకాల షాప్ అంటే... అది ఒకప్పుడు మంచి ఔట్డోర్ ఫోటోగ్రాఫర్ పాడి గారిది 
ఆషాప్ ను ఈ వేది గారికి అప్పజెప్పారు !
ఈ వేదిగారు కృష్ణపక్ష కావ్యానికి సమాంతరంగా... 
శుక్లపక్షం అనే కావ్యాన్ని రాసిన 
అనoత పంతులవారి బంధువే 
పేరు సామవేది ! మేమంతా వేది గారని పిలిచేవాళ్ళం !
ఆయనోమారు ఆంధ్రభూమి మంత్లీ లో ఆయన రాసిన ఛాయాగీతం ఫోటో కవితను చూపించి... మీరూ రాయండి అన్నారు !
ఆ ఛాయాగీతం ఫోటోకవితలు 
ఆయనవి అప్పటికేచాలా ప్రచు
రితమయ్యాయి !
కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి !
నేనూ రాయటం మొదలు పెట్టాను... నావీ విరివిగానే వస్తుండేవి !
రెండు ఛాయాచిత్రాలిచ్చేవారు 
ఒకో చిత్రానికీ ఇంచుమించు నాలుగేసి లైన్ లు  రాసేవాళ్ళం 
అలా మొత్తం నా ఛాయాగీతాలు శతాధికంగా ప్రచురితమైనా... ఒక్కొనేల రెండేసి  మూడేసి గేయాలు ప్రచురితమైనా... ఒకే సారి సెకెండ్, థర్డ్ ప్లేసుల్లో గేయాలు వచ్చేవి... గానీ ఒక్కమారూ 
ఫస్ట్ ప్రైస్ కొట్టలేక పోయాను !
ఆంధ్రభూమి,చందమామ,ఆంద్ర
జ్యోతి లాంటి పత్రికలలో ఫోటో వ్యాఖ్యల పోటీలుండేవి !
ఓ మారు చందమామలో ఓచిన్న పిల్ల, మరోచిన్నపిల్లాడికి సిరంజ్ పట్టుకుని ఇంజక్షన్ ఇస్తున్నట్టు... మరో ఫోటోలో... 
ఓ అబ్బాయి ఫోన్ లో మాటాడుతున్నట్టు... !ఆఫోటోలకు నేను పోస్ట్ కార్డు పై 
వ్యాఖ్య రాసి పంపి మరిచిపోయాను ఓ మారు వేదిగారి షాపులో చందమామ తిరగేస్తుంటే.. ఆఫోటోలకు బహుమతి పొందిన వ్యాఖ్యను ప్రచురించారు చదివాను 
"అనుభవం లేని సిస్టర్... !
 అర్జెంటు గా రండి డాక్టర్ !!"
అబ్బా బాగారాసారు అనుకుని 
దిగువన పేరుచూస్తే... కోరాడ నరసింహారావు యాదవ్, భవానీస్టుడియో,పార్వతీపురం, 
ఆశ్చర్యం-ఆనందం.. అది మొదలు... వివిధ పత్రికలలో.. 
ఎన్నె న్నో ఫోటో వ్యాఖ్యలు !
ఎన్నో బహుమతులు !!
    ********
    **  సశేషం  ***
కామెంట్‌లు