తుంటరి కుందేలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒక అడవిలో మహాతెలివిగల కుందేలు తన తుంటరితనంతో తోటి జంతువులను ఏడిపిస్తూ ఉండేది. ఒకసారి అది గంతులేస్తూ  ఎగురుతూ చెరుకుతోటలోని ఏనుగుని "ఓయ్ !మామా!రోజూ నీవెంత చెరకు తింటావు?"అని నిలదీసింది. "ఒరేఅల్లుడూ!నాభారీకాయాన్ని చూస్తున్నావుకదా?రోజూ ఓపది కిలోలు కనీసం అల్పాహారం గా లాగిస్తాను.దాన్ని బట్టి నాతిండిని అంచనావెయ్యి"అందిఏనుగు."నీఆకారం పెద్దదేకాని నీకు శక్తి బలం ఉందా అని నాఅనుమానం!ఊబకాయదేహం!" కొంటెగా రెచ్చగొట్టింది కుందేలు. "ఏంరా!నాబలాన్నే శంకిస్తున్నావా?" "మామా!నేను నీకన్నా  బలవంతుడిని.నీకాలుకి తాడుకట్టి ఆనది ఒడ్డుదాకా  నిన్ను ఈడ్చుకెళ్తాను సరేనా?" అని కుందేలు ఓ మొద్దు తాడుని ఏనుగు కాలికి కట్టి "నేను పిల్చినప్పుడురా!" అని నది దగ్గరకు పరుగెత్తి లోపలున్న మొసలిని " బావా! నీవు చాలా బలవంతుడివికదూ?"అని అడిగింది.  "అందుకు సందేహమా?"మొసలి మాటవింటూ పకపకా నవ్వింది. "బావా!నీకు నాబలం ఇప్పుడే చూపుతా! నీమెడకి తాడుకట్టి ఒడ్డుకి లాగేస్తా"అని  మొసలి మెడకు తాడు బిగించి తాను ఓచెట్టు వెనకదాక్కుంది."ఒకటీ రెండు మూడు "అని కుందేలు అరవగానే ఇటుకొసన మొసలి ఆతాడు కొసకి ఏనుగు   బలంగా తాడు ని గుంజసాగాయి.అంటే టగ్ ఆఫ్ వార్ లాగా అన్నమాట! అలా రెండూ "బాబోయ్!కుందేలు కి ఇంత బలం ఎక్కడనించి వచ్చింది?"అని మల్లగుల్లాలు పడుతూ ఏనుగు  గట్టు పైన మొసలి నీటిలో బలంగా తాడు ని చెరోపక్కనించి లాగుతోంటే కుందేలు తనలోతానే నవ్వుకుంటూ సంబరపడసాగింది. కానీ ఆరెండుజంతువుల బలానికి తాడు పుటుక్కున తెగి మొసలి  నీటిలో అంతెత్తున ఎగిరి పడితే  ఏనుగు  వెనుక ఉన్న చెట్టుకి ఢీకొట్టడం తో ఆరెండు జంతువులు మనసులో ఇలాఅనుకున్నాయి"కుందేలు చూడటానికి చిన్నదేకానీ దాని బలం నాకు లేదు "అని. కుందేలు కనపడితే చాలు వాటి గుండె ఠార్ అంటుంది.నోరు పెట్టుకుని మోసంచేస్తూ బతికేవారు ఉన్నారు. వారి మాటలకి బోల్తా పడకుండా జాగ్రత్త గా ఉండాలి సుమా! నేడు మనం చూస్తున్నాం"నాకు  గొప్ప వ్యక్తులు తెలుసు. మీకు ఏపనికావాలన్నా చిటికెలో చేస్తా"అని  అమాయకులతోపాటు అధికార్లను మోసంచేస్తూ పబ్బం గడుపుకునేవారు ఎందరో? వారి మాయమాటలకి కల్లబొల్లి కబుర్లకు లొంగితే ఇంతే సంగతులు!తస్మాత్ జాగ్రత్త!!
కామెంట్‌లు