అక్కమనసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాధకి ఓచిట్టిచెల్లి రాణి నాలుగేళ్ళ ది ముద్దు ముద్దుగా బొద్దుగా బాగుంటుంది. అంతా ఎత్తుకుని చిన్న చిన్న పాటలు పాడించి ఆనందించడం తొమ్మిది ఏళ్ళ రాధకి మింగుడు పడదు. ఆపిల్ల కి ఎక్కడో తెలీని బాధ అసూయ! తను క్లాస్ ఫస్ట్ వచ్చినా ఎన్ని బహుమతులు తెచ్చినా తనని ఎవరా అంతగా ముద్దు చేయరు.కంగ్రాట్స్ అనేస్తారు అంతే!ఒక సారి  అదేప్రశ్న అమ్మ ని అడిగితే నవ్వుతూ అంది" నీవు పెద్దపిల్లవి.ఎలాఎత్తుకునిముద్దాడుతారు? ఇంకో ఏడాది పోతే రాణీనికూడా ఎవరూ ఎత్తు కోరు" కాస్త తృప్తి పడినా మనసు లో ముల్లు గుచ్చుకుంటున్నది."ఛ ఛ!నేను మొదట పుట్టకుండా ఉంటే బాగుండేది!"నాన్న అన్నాడు"పిచ్చి తల్లీ! మొదటిపిల్లలకే అచ్చట్లు ముచ్చట్లు! నేను రెండో వాడిని. మాఅన్నయ్య కి పొట్టి ఐన చొక్కా లాగూలు నాకు వేసేది మాఅమ్మ. వాడి బొమ్మలతో ఆడాను.ఇంటిభారం మోసే తలకొరివి పెడ్తాడని వాడిని ఇంజనీరింగ్ చదివించారు.మానాన్న చనిపోటంతో డిగ్రీ చేసి బ్యాంక్ లో చేరాను." రాధకి అవి అంతగా బుర్రకెక్కలేదు.ఆరోజు కసిగా చెల్లి బుగ్గలు గోళ్ళతో గిల్లి వీపుపై బాదింది. కెవ్ న ఏడుస్తున్న చెల్లిని నాన్న ఎత్తు కుంటే అమ్మ రాధ వీపుపై దరువేసింది.ఇంటిపైకప్పు ఎగిరేలా కోపం కసి ఉక్రోషం తో రాధ వెక్కి వెక్కి ఏడుస్తూ అరిచింది " నాస్కేల్ విరగకొట్టింది.నానోట్స్ అంతా పిచ్చి గీతలు గీసింది."చెల్లి పాలబుగ్గలు రక్తంతో ఎర్రబడింది.బూరెలులాగా పొంగాయి.నాన్నపక్కింటి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లి ఇంజెక్షన్ చేయించాడు.రాధకి ఇష్టమైన చాక్లెట్లు బిస్కెట్టు పాకెట్ తెచ్చాడు.  "పిల్లల గోళ్ళు కత్తిరించు."నాన్న అనటం విన్పడింది."అమ్మా!నెప్పి!"బాధగా రాణి అంటోంది.
ఇంజక్షన్ నెప్పికి మూలుగుతోంది."తగ్గిపోతుంది తల్లీ! ఇకముందు అక్కవి మీ బడి పిల్లల వస్తువులు తీశావంటే నేను కొడ్తాను"అమ్మ ఓదారుస్తోంది. "ఉహు !నేను చెయ్య!" అమ్మ గుండె లో తలదాచుకుంది రాణి.ఆరాత్రి రాణి నాన్న దగ్గర పడుకుంది. రోజూ అక్కదగ్గర పడుకుంటుంది.రాధకి నిద్ర పట్టక అటూఇటూ దొర్లుతోంది.రోజు చెల్లి తనను హత్తుకుని అక్కా అంటూ ఏవేవో ఊసులు చెప్పుతుంది.రాధకి ఎక్కడినించో కమ్మని సంగీతం దేవలోకంలోని  ఐదేళ్లలోపు పాపాయిల కిలకిలలతో  "అక్కా రాధక్కా! మాకు నీవు కావాలి. మాతోమాట్లాడి ఆడి పాడవూ?మాలోకంలో నీలాంటి అక్కలు లేరు"అంటూఒకరిచేతిలోని పండుఫలాలు ఇంకోరికి ఇస్తూ తింటున్నారు. తమ ఆటవస్తువులు ఒక చోట పోగేసి ఎవరిఇష్టం వచ్చినవి వారు తీసుకుని విరగకొడుతున్నారు.ఐనా అస్సలు పోట్లాడుకోటంలేదు.తమ ఆటవస్తువులను వేరేవారు పాడుచేసినా కేరింతలు కొట్టి " ఫర్వాలేదని అంటూ "రాధక్కా! మేమంతా  పోట్లాడుకోము.కొట్టుకోము.మేమంతా ఒక్కటే!" అంటున్నారు. "నాన్నా! నేను  అక్కదగ్గర పడుకుంటా!" రాణీ ఏడ్పు వినపడుతోంది. ఠక్కున రాధకి మెలుకువ వచ్చింది.  "అరే! ఇదంతా  కలా!!?" గబగబా నాన్నదగ్గరకు పరుగెత్తి  "చిట్టీ !బుజ్జీ! నాన్న  చెల్లిని నాదగ్గర పడుకోబెట్టు "అంటున్న రాధవైపు  ఆనందం గా చూశాడు. రాధ చెల్లి చేతులపై ముద్దుల వర్షం కురిపిస్తోంది.
కామెంట్‌లు