ఋతువుల రగడ (బాలలకథ)( "రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(మూడవభాగము);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 11)
వర్ష ఋతువు నేను
హర్ష గీతికను ఔను
నేనే కర్షక బంధువు
అవుతాను నేను సింధువు!
12)
మబ్బుల దొంతర మసకలు
తొలకరి చినుకుల పులకలు
గలగల సాగే ఝరం
పుడమి తల్లికే అభిషేకం!
13)
ఏడురంగుల ఇంద్ర ధనువులు
పంటలకే పన్నీటి స్నానాలు
ఆనంద డోలికల మనసూగుతుంది
ప్రకృతికే పసిడి వరమౌతుంది!
14)
అన్నింటికీ నేనే మూలం
నాకు మించి లేదేకాలం
అందుకే అంటున్నా నేనేగొప్పా
అలా అనడం తప్పా?
(సశేషము)

కామెంట్‌లు