జైవిజ్ఞాన్!;-.అచ్యుతుని రాజ్యశ్రీ

 జైజవాన్ జైకిసాన్ తో కలిపావు జైవిజ్ఞాన్!
గ్వాలియర్ లో ప్రభవించి కృష్ణాదేవి కృష్ణబిహారీ వాజపేయి ఒడిలో పెరిగి
సరస్వతీ శిశుమందిర్ లో ఎదిగి హిందీ సంస్కృతం ఆంగ్లంలో కవితలల్లి
భారతీయ సంగీత సాహిత్య నాట్యం పై మక్కువ!మనాలీ ప్రకృతి ఒడిలో పరవశించి 
క్విట్ ఇండియా తో రాజకీయ అరంగేట్రం!
అచంచల విశ్వాసం  అద్భుత వాగ్ధాటి!
పార్లమెంటులో దద్దరిల్లె
నవ్వులు చిత్తుచేసే నీ పంచ్ సెటైర్లు తో ఉక్కిరిబిక్కిరి!
పదమూడు రోజులు  పదమూడు మాసాలు పదమూడవ లోక్ సభ!
రాజకీయ భీష్ముడివి!
భారతరత్న అటల్జీ!
బ్రహ్మచారి గా మోడీజీకి ఆదర్శం!
అనారోగ్యం తో మాటామంతీలేక భీష్మపితామహా!తొంభై మూడేళ్ళ పండుగా 
అమరుడైనావు!
సుపరిపాలనాదినం ఈరోజు!
తలిచేము నిన్ను ప్రతిరోజు!
కామెంట్‌లు