వినరా .. వినరా ; - డాక్టర్ . నలిమెల భాస్కర్

 వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
సెల్ మాతను నేనేరా ఏదీ నను పోలదురా/వి/
కల్లాకపటం ఎరుగని గంగిగోవును నేను
ఏది ఒత్తినా కాదని ఎదురు చెప్పలేను
బ్యాలెన్సును తిని నేను బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను/వి/
కమ్మనైన సీనులొన్నొ స్క్రీనునిండ ఇస్తున్నా
కార్యానుకూలతకు మీకు మేలు చేస్తున్నా
తప్పుడు పనులకు నను దుర్వినియోగిస్తుంటే
ఉబుసుపోని వారలతో సొల్లు కారుస్తున్నా/వి/
నా ఎఫ్ బి బిడ్డ మీ మైండు విప్పు స్థలమోయి
నా వాట్సపున మీ రాతల పంట పండునోయి
నా జన్మమె మీ చేతికి గొప్ప నగ గ మారెనోయి
నా ఒళ్ళే మీ కళ్ళకు మోదం పుట్టించునోయి
కామెంట్‌లు